తెలంగాణ

కృష్ణాజలాల తరలింపు వేగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: నాగర్‌కర్నూలు, వనపర్తి, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు సాగునీటిని, తాగునీటిని అందించేందుకు రూపొందించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు, నాగర్‌కర్నూలు, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మరికొన్నిప్రాంతాలకు సాగునీటిని, తాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ రెండు పథకాల పురోగతిని పరిశీలించేందుకు హైదరాబాద్ నుండి మీడియా ప్రతినిధులను ఆదివారం ప్రభుత్వం తీసుకువెళ్లింది. ఈ రెండు పథకాల పనులను రాష్ట్రప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వయంగా మీడియాకు వివరించారు. కల్వకుర్తి లిఫ్ట్ పథకం ద్వారా 3.65 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందకు 40 టిఎంసిల శ్రీశైలం జలాశయం నీటిని వరదల సమయంలో తరలించాలని ప్రతిపాదించారు. 4896 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టు నీటిని మూడు చోట్ల ఎత్తిపోతల ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు జరిగాయి. శ్రీశైలం ఒడ్డున ఎల్లూరు వద్ద మొదటి ఎత్తిపోతలను ఏర్పాటు చేసి ఐదు పంపుల ద్వారా నీటిని తోడుతున్నారు. పెద్దకొత్తపల్లి మండలంలోని జొన్నలబొగుడ వద్ద ఉన్న రెండో ఎత్తిపోతలలో ఐదుపంపులకు గానూ రెండింటిని, నాగర్‌కర్నూలు మండలంలోని గుడిపల్లి వద్ద ఏర్పాటు చేసిన మూడో లిఫ్ట్‌లో ఐదు పంపులకు గాను రెండు లిఫ్టులు పనిచేయడం ప్రారంభించాయి. 2016 ఖరీఫ్‌లో దాదాపు 1.60 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడం ప్రారంభమైంది. ప్రధాన కాలువకు వస్తున్న నీటిని తొలుత 432 చెరువులు, కుంటలను, కుంటల్లోకి నీరు చేరడంతో సమీపంలోని భూగర్భజలాలు కూడా గణనీయంగా పెరిగాయని నిరంజన్ రెడ్డి తెలిపారు.
పాలమూరు-రంగారెడ్డి
నాగర్‌కర్నూలు, వనపర్తి, మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాలకు సాగునీటిని, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు తాగునీటిని అందించేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు 35,200 కోట్ల రూపాయలు వ్యయం అవుతాయని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టును ఐదు చోట్ల లిఫ్ట్‌ద్వారా తరలించాల్సి ఉంది. మొదటి లిఫ్ట్ కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్ వద్ద శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ వద్ద ఏర్పాటు చేస్తున్నారు. రెండో లిఫ్ట్‌ను గోపాల్‌పేట మండలంలోని ఏదుల వద్ద, మూడో లిఫ్ట్ బిజినేపల్లి మండలంలోని వట్టెం గ్రామం వద్ద ఏర్పాటు చేస్తున్నారు. నాలుగోలిఫ్ట్‌ను భూత్పూర్ మండంలోని కరివెన గ్రామం వద్ద, నాలుగో లిఫ్ట్‌ను జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ వద్ద ఏర్పాటు చేస్తున్నారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్, కెపి లక్ష్మీదేవిపల్లి (కొందుర్గు మండలం) జలాశయాల్లో నీటిని నిలువ చేస్తారు. ఉదండపూర్, లక్ష్మీదేవిపల్లి మినహా మిగతా జలాశయాలకు వీలైనంత త్వరలో ఉపయోగంలోకి తీసుకువస్తామని నిరంజన్ రెడ్డి వివరించారు. ఈ ప్రాజెక్టులో 58 కిలోమీటర్లు టనె్నల్‌ద్వారా నీటిని తరలించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు.