తెలంగాణ

రైతాంగాన్ని గాలికి వదిలేసిన కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: తెలంగాణలో రైతాంగాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని , రైతాంగ సమస్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పట్టింపే లేదని బిజెపి కిసాన్ మోర్చ అధ్యక్షుడు గోలి మధుసూధన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నాడు కిసాన్ మోర్చ రాష్ట్ర పదాధికారుల సమావేశం బిజెపి కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్, జాతీయ ప్రధానకార్యదర్శి పి మురళీధరరావు, కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పి సుగుణాకర్‌రావు హాజరయ్యారు. డిసెంబర్ 16 నుండి జరగబోయే శాసనసభ సమావేశాలలో రైతుల రుణాలు ఒకేసారి పూర్తిగా మాఫీ చేయాలని, రైతులు చెల్లించాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీని వెంటనే రైతుల ఖాతాల్లో జమచేయాలని, కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని సక్రమంగా రాష్ట్రప్రభుత్వం 30వ తేదీలోగా అమలుచేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతూ సమావేశం తీర్మానం చేసింది. రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబర్ 23న ఇందిరాపార్కు వద్ద కిసాన్‌మోర్చ ఆధ్వర్యంలో రైతు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. 13 నుండి 20 వరకూ అన్ని గ్రామాల్లో కిసాన్ మోర్చ ఆధ్వర్యతంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో పంటలకు ప్రీమియం చెల్లించే విధంగా కరపత్రాల ద్వారా గ్రామగ్రామాన ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. రాష్ట్రప్రభుత్వ యంత్రాంగం, వ్యవసాయ అధికారులు, రెవిన్యూ అధికారులు, బజాజ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ అధికారులు, చోలా ఇన్స్యూరెన్స్ కంపెనీ అధికారులు గ్రామగ్రామాన సభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని సమావేశం కోరింది.