తెలంగాణ

కరవు ప్రాంతాలకు తాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: వారానికి ఒక పర్యాయం ప్రజల అవసరాలకోసం తాగునీటిని ఇవ్వడం కూడా గగనంగా ఉన్న వనపర్తి, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని తాగునీటి సరఫరాకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ జిల్లాలు తరచూ కరవు బారిన పడుతుండటంతో ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. 12 శాసనసభా నియోజకవర్గాలకు చెందిన దాదాపు 300 గ్రామాలకు, నాలుగు పట్టణాలకు తాగునీటిని ఇచ్చేందుకు ఒక ప్రణాళికను రూపొందించారు. నాగర్‌కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుండి రోజూ 46,250 కిలోలీటర్ల నీటిని ఇందుకోసం వినియోగించాలని నిర్ణయించారు. నాగర్‌కర్నూలు జిల్లా రేవల్లె మండలంలోని గౌరిదేవుపల్లి గ్రామంలో సిమెంట్ కాంక్రీట్‌తో భారీ వాటర్‌ట్యాంక్‌ను నిర్మిస్తున్నారు. అచ్చంపేట, నాగర్ కర్నూలు ప్రాంతాలకు ఇక్కడే నీటిని శుద్దిచేసి సరఫరా చేయాలని నిర్ణయించారు. మిగతా ప్రాంతాలకు శుద్ధిచేయని నీటిని పంపించి, ఆ యా ప్రాంతాల్లో శుద్దిచేసిన తర్వాత ప్రజల అవసరాలకు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని మిషన్ భగీరథ పథకంలో భాగంగా చేపట్టామని అధికార వర్గాలు వెల్లడించాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కెఎల్‌ఐ) ద్వారా తరలించే 40 టిఎంసిల నీటిలో రెండు టిఎంసిల నీటిని మంచినీటి అవసరాల కోసం ఉపయోగిస్తామని ఈ వర్గాలు వెల్లడించాయి. 4896 కోట్ల రూపాయలను కెఎల్‌ఐ పథకానికి వినియోగిస్తున్నారు. కెఎల్‌ఐ పథకంలో ఇప్పటికే పాక్షికంగా కృష్ణా జలాలలను నాగర్‌కర్నూలు, వనపర్తి జిల్లాలకు తరలించి, సాగునీరు, తాగునీటి కోసం వినియోగిస్తున్నారు. కెఎల్‌ఐ పథకం పూర్తయితే కరవు జిల్లాల్లో భూగర్భజలాలు కూడా గణనీయంగా పెరుగుతాయని, సాగుకోసం, తాగునీటి కోసం ఇక్కట్లు దూరమవుతాయని ఈ జిల్లాల్లోని ప్రజలు సంబరపడుతున్నారు.