తెలంగాణ

మినీ వ్యాన్ పల్టీ...్ప నలుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుర్కపల్లి, నవంబర్ 25: నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపురం మూలమలుపు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మినీ వ్యాన్ పల్టీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే...మినీ వ్యాన్‌లో డ్రైవర్‌తో పాటు 15 మంది ఉండగా వారంతా హైదరాబాద్ వౌలాలి హౌసింగ్ బోర్డు నుండి యాదగిరిగుట్టకు కార్తీక పౌర్ణమి పూజలకు వెళ్లి పూజల అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్తూ ఈ ప్రమాదానికి గురయ్యారు. మృతుల్లో ధీరావత్ అజయ్‌కుమార్ (10), ధీరావత్ వౌనిక (15), తల్లికొడుకులు ధీరావత్ కమలమ్మ (30), ధీరావత్ నాగరాజు (12) ఉన్నారు. వ్యాన్ డ్రైవర్, యాజమాని అయిన ధీరావత్ రాంచందర్ తాగి ఉండడంతో వాహనం అదుపు తప్పి మూలమలుపు వ ద్ద మూడు పల్టీలు కొట్టింది. మృతి చెందిన అజయ్‌కుమార్ రాంచందర్ కుమారుడే కాగా కూతురు జ్యోతి కూడా ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆమెతో పాటు ధీరావత్ శ్రీనుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారితో పాటు స్వల్పంగా గాయపడిన మరో ఆరుగురిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద బాధితులంతా సొంత బంధువులు కావడం గమనార్హం. వీరంతా జీవనోపాధి కోసం వౌలాలి హౌసింగ్‌బోర్డులో నివసిస్తున్నారు. మృతుల్లో అజయ్‌కుమార్, వౌనికల స్వస్థలం బొమ్మలరామారం మండలం నాయకునితండా, కమలమ్మ, నాగరాజులది బీబీనగర్ మండలం జంపల్లి గ్రామం. ప్రమాద జరిగిన సమాచారం అందిన వెంటనే బంధువులంతా సంఘటనా స్థలానికి తరలివెళ్లడంతో రోదనలతో దద్దరిల్లింది. భువనగిరి సిఐ రఘువీరారెడ్డి, ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి సంఘటనను పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

మహిళా రైతుపై పోలీసు లాఠీ

బోరుమన్న మహిళా రైతు ఖాకీల జులుంపై రోడ్డెక్కిన రైతులు

జగిత్యాల, నవంబర్ 25: డిజిపి నుండి ఎస్పీ స్థాయి వరకు ప్రజలకు చేరువ కావాలనే లక్ష్యంతో ఫ్రెండ్లీ పోలీస్ చేపడితే ఇందుకు విరుద్థంగా కొందరు పోలీస్ అధికారుల అలుసుతో కింది స్థాయి సిబ్బంది లాఠీలు ఝళిపిస్తూ మామూళ్లు వసూలు చేస్తూ పోలీస్‌శాఖకే మాయనిమచ్చ తీసుకొస్తున్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మార్కెట్లో బుధవారం కూరగాయలు అమ్ముకుంటున్న మ హిళా రైతుపై పోలీస్ లాఠీ ప్రతాపం చూపాడు. రోడ్డుపై కూరగాయలు విక్రయించడానికి వీలు లేదంటూ ఓ మహిళా రైతుపై ఖాకీలు కనె్నర్ర చేసి లాఠీ ఝుళిపించడంతో ఖాకీ తీరు నిరసిస్తూ కర్షకులు రోడ్డెక్కి ధర్నా, రాస్తారోకో చేయడం ఉద్రిక్తతకు తీసింది. ఆరుగాలం శ్రమించి, కష్టకష్టాలకోర్చి పండించిన కూరగాయలు మార్కెట్లో అమ్ముకునేందుకు వస్తే రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు విక్రయించడానికి వీల్లేదంటూ ఏనుగుల గంగవ్వ అనే మహిళా రైతుపై హోంగార్డు రాములు లాఠీ ఝుళిపించాడు. తానేమి తప్పు చేశానని లాఠీ ఝుళిపించావని కన్నీళ్లు పెడుతూనే ఆమె అతనితో వాగ్వాదానికి దిగింది. కర్షకులంతా ఒక్కటై ఆ ఖా కీని నిలదీయగా గంగవ్వపై మరోసా రి లాఠీ ఝుళిపించాడు. దీంతో కర్షకులు ఖాకీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డిని ఆశ్రయించారు. కర్షకులపై ఖాకీల జులుంపై ఆయన ఉన్నతాధికారులకు వివరించారు. మహిళా రైతుపై పోలీస్ లాఠీచార్జిని నిరసిస్తూ గురువారం ఆందోళనకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు.

ఖాకీ దెబ్బలకు తాళలేక కన్నీళ్లు పెడుతున్న మహిళా రైతు ఖాకీల తీరు నిరసిస్తూ రోడ్డెక్కిన కర్షకులు