తెలంగాణ

విపక్షాలకు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ టిఆర్‌ఎస్ వశం
టిడిపి, కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ నుంచి విరమణ
హ్యాట్రిక్ విజయం అందుకోనున్న భూపాల్‌రెడ్డి

సంగారెడ్డి, డిసెంబర్ 11: నాటకీయ పరిణామాల మధ్య స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని అధికార టిఆర్‌ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాన్ని దక్కించుకున్నారు. కాంగ్రెస్, టిడిపి పార్టీలకు చెందిన అభ్యర్థులు శుక్రవారం కలెక్టరేట్‌కు చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, సంయుక్త కలెక్టర్ వెంకట్రాంరెడ్డికి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు లిఖితపూర్వకంగా తెలియజేసారు. అధికార టిఆర్‌ఎస్ దూకుడును అడ్డుకుని ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని తలంచిన కాంగ్రెస్, టిడిపి రాష్ట్ర అధిష్ఠానాలకు దిమ్మతిరిగిపోయే విధంగా రెండు పార్టీల అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ముఖ్య నేతలు తలలు పట్టుకుంటుండగా, పార్టీల శ్రేణులను నివ్వెరపర్చారు. టిఆర్‌ఎస్ అభ్యర్థి ఎం.్భపాల్‌రెడ్డి ముచ్చటగా మూడవసారి శాసనమండలికి ఎన్నికై హ్యాట్రిక్ సాధించనున్నారు. ప్రజాప్రతినిధులు అంతంత మాత్రం ఉన్న తెలుగుదేశం అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నా పెద్ద నష్టం లేదని, కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉండగా కొద్దిపాటి శ్రమిస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయని, ఇలాంటి సమయంలో అభ్యర్థి పోటీ నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ములుగు మండలానికి చెందిన టిడిపి నాయకుడు కొన్యాల బాల్‌రెడ్డి ఈ నెల 9వ తేదీన పార్టీ జిల్లా అధ్యక్షురాలితో పాటు పలువురు ముఖ్య నేతలతో కలిసి వెళ్లి నామినేషన్‌ను అట్టహాసంగా దాఖలు చేసారు. సదాశివపేట పట్టణానికి చెందిన శివరాజ్ పాటిల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన బి ఫాం దక్కించుకుని జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపి సురేష్ షెట్కార్ల ఆధ్వర్యంలో నామినేషన్ దాఖలు చేసారు. అధికార టిఆర్‌ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తారని రాజకీయ విశే్లషకులు భావించగా, ప్రజాప్రతినిధులకు కాస్తోకూస్తో నగదు చేతికందుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు టిడిపి అభ్యర్థి కొన్యాల బాల్‌రెడ్డి నేరుగా జాయింట్ కలెక్టర్ చాంబర్‌లోకి వెళ్లి నామినేషన్ ఉపసంహరణ పత్రాలు అందజేసి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం 12.30 గంటలకు కాంగ్రెస్ అభ్యర్థి శివరాజ్ పాటిల్‌ను నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, పటన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు మురళీధర్ యాదవ్‌ల ఆధ్వర్యంలో జెసి వద్దకు వెళ్లి నామినేషన్ ఉపసంహరణ పత్రాన్ని అందజేసారు. అనంతరం శివరాజ్ పాటిల్ టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించి గులాబి కండువా ధరించారు.

ఏకగ్రీవం దిశగా
నిజామాబాద్
అనూహ్యంగా బరి నుండి తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్థి
ఉపసంహరణ బాటలోనే మరో స్వతంత్ర అభ్యర్థి!
తెరాస అభ్యర్థి భూపతిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఛాన్స్

నిజామాబాద్, డిసెంబర్ 11: ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ప్రతిష్టాత్మకంగా భావించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోరులో ఎన్నికలకు ముందే అనూహ్య పరిణామాలు చోటుచేసుకుని రాజకీయ సమీకరణాలు తారుమారవుతున్నాయి. రసవత్తర పోటీ నెలకొంటుందని భావించిన నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానం కాస్తా అధికార పార్టీకి అనుకూలంగా ఏకగ్రీవమయ్యే దశకు చేరుకుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనున్న శనివారం నాటితో ఏకగ్రీవంపై స్పష్టత రానుంది. అయితే ఇప్పటికే ఎమ్మెల్సీ బరిలో ప్రధాన పోటీదారుగా నిలుస్తారని భావించిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణారెడ్డి అనూహ్యంగా పోటీ నుండి వైదొలగడంతో తెరాస అభ్యర్థి భూపతిరెడ్డి ఎన్నిక లాంఛనమేనని భావిస్తున్నారు. జిల్లాలోని ఒక ఎమ్మెల్సీ స్థానం కోసం తెరాస తరఫున డాక్టర్ ఆర్.్భపతిరెడ్డి, కాంగ్రెస్ పక్షాన జడ్పీ మాజీ చైర్మెన్ వెంకటరమణారెడ్డితో పాటు ఎంపిటిసిల ఫోరం తరఫున స్వతంత్ర అభ్యర్థిగా పిట్లం ఎంపిటిసి బి.జగదీష్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణారెడ్డి ఒంటరిగా రిటర్నింగ్ అధికారి చాంబర్ వద్దకు చేరుకుని తమ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకోవడం కలకలం సృష్టించింది. దీంతో ఎమ్మెల్సీ బరిలో తెరాస అభ్యర్థి ఆర్.్భపతిరెడ్డి, స్వతంత్ర అభ్యర్థి జగదీష్‌లు మాత్రమే మిగిలారు. వీరిలోనూ ఎంపిటిసి ఫోరం తరఫున పోటీకి సిద్ధపడ్డ జగదీష్ కూడా శనివారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకోనున్నారని తెలిసింది. శుక్రవారం రోజునే ఆయన ఎంపిటిసిల ఫోరం ప్రతినిధులతో కలిసి రాష్ట్ర రాజధానిలో ముఖ్యమంత్రి కెసిఆర్‌తో భేటీ అయినట్టు సమాచారం. ఎంపిటిసిల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని సిఎం హామీ ఇవ్వడంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన వారంతా బరి నుండి వైదొలగేందుకు అంగీకరించారని తెరాస వర్గాలు పేర్కొన్నాయి. ఇదే జరిగితే నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఎలాంటి పోటీ లేకుండా తెరాస అభ్యర్థి ఆర్.్భపతిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవడం లాంఛనమేనని స్పష్టమవుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ అభ్యర్థి నుండి గట్టి పోటీ ఎదురవుతుందని అంతా భావించగా, సదరు అభ్యర్థి గడువుకంటే ఒకరోజు ముందుగానే నామినేషన్‌ను వెనక్కి తీసుకోవడంతో ఒక్కసారిగా ఊహాగానాలు గుప్పుమన్నాయి. నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఏకగ్రీవం చేసేందుకు తెరాస ప్రధాన నేతలు తెర వెనుక వ్యూహాత్మకంగా పావులు కదిపారనే ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకించి మంత్రి హరీష్‌రావు ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్టు సమాచారం.
నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి

ఆదిలాబాద్ ఏకగ్రీవం!
టిడిపి, స్వతంత్ర అభ్యర్ధుల నామినేషన్ ఉపసంహరణ

ఆదిలాబాద్, డిసెంబర్ 11: ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచిన టిడిపి అభ్యర్థి ఎల్.నారాయణరెడ్డి, స్వతంత్ర అభ్యర్థి మహ్మద్ రియాజోద్దిన్ శుక్రవారం నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో టిఆర్‌ఎస్ అభ్యర్థి పురాణం సతీష్ ఎన్నిక ఇక ఏకగ్రీవమయ్యంది. అయితే ఎన్నికల కమిషన్ లాంఛనంగా ఏకగ్రీవ ఎన్నికను ప్రకటించాల్సి ఉంది. జిల్లాలో ఎమ్మెల్సీ స్థానానికి తూర్పు జిల్లాలోని బ్రాహ్మణ వర్గానికి చెం దిన టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్ పేరును ముఖ్యమంత్రి ఖరారు చేయగా ఇటీవలే అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఇందుకు దీటుగా కాంగ్రెస్ అభ్యర్థిగా డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేరును అధిష్ఠానం ఖరారు చేయగా ఆయన చివరిక్షణంలో మనసుమార్చుకొని పోటీచేయడం లేదని ప్రకటించి, కాంగ్రెస్‌కు షాక్ తినిపించారు. ఈ నేపథ్యంలోనే టిడిపి తరుపున నామినేషన్ వేసిన జిల్లా సీనియర్ నేత ఎల్.నారాయణ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా నాయకుడు మహ్మద్ రియాజోద్దిన్ నామినేషన్లు వేయగా జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్నలు వారితో మంతనాలు సాగించి, నాటకీయ పరిణామాల మధ్య గురువారం అర్ధరాత్రి ముఖ్యమంత్రి కెసిఆర్‌తో కలిపించి పోటీ నుండి విరమించుకున్నట్లు ప్రకటించారు. అంతేగాక తామిద్దరం టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు పేర్కొనడం గమనార్హం. శుక్రవారం మంత్రులు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యేలను వెంటేసుకొని ఇద్దరు అభ్యర్థులను కారులో నేరుగా ఆదిలాబాద్‌కు తీసుకువచ్చి నామినేషన్ పత్రాలను ఉపసంహరింపజేశారు. అనంతరం తెలంగాణ చౌక్‌లో జరిగిన విజయోత్సవసభలో మంత్రులు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ప్రతిపక్ష పార్టీలు సైతం పోటీకి వెనుకంజ వేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వేయకుండానే ఓటమికి బయపడి రంగం నుండి తప్పుకోవడం ద్వారా ఆ పార్టీ జిల్లాలో పూర్తిగా కనుమరుగైందని విమర్శించారు. కెసిఆర్ నేతృత్వంలో టిఆర్‌ఎస్ పార్టీ ప్రభంజనం భవిష్యత్తులో ఇదేవిధంగా కొనసాగుతుందన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పురాణం సతీష్ మాట్లాడుతూ తన ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన రాజకీయ పార్టీలకు, జిల్లా ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు బాణసంచా పేలు స్తూ విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, దుర్గం చిన్నయ్య, రాథోడ్ బాపురావు, విఠల్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ దామోదర్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా తదితరులు పాల్గొన్నారు.

టిఆర్‌ఎస్ అభ్యర్థి పురాణం సతీష్