తెలంగాణ

మైనార్టీలకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారిని గొప్ప కాంట్రాక్టర్లుగా చూడాలని ఉంది బడ్జెట్ కేటాయింపుల్లో నిర్లక్ష్యం సహించను
మైనార్టీల సంక్షేమంపై సిఎం కెసిఆర్ సమీక్ష హాజరైన అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్: బడ్జెట్‌లో కేటాయింపులు జరిగిన తర్వాత కూడా అమలులో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులను హెచ్చరించారు. మైనార్టీలు అనగానే నిర్లక్ష దోరణి ప్రదర్శించడం ఆహ్వానించదగిన పరిణామం కాదని ముఖ్యమంత్రి అన్నారు. బడ్జెట్‌లో మైనార్టీ సంక్షేమానికి నిధుల కేటాయింపుపై ఆదివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంఐఎం నుంచి హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, ఎంపి వినోద్‌కుమార్, మైనార్టీ వెల్ఫేర్ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, ఏసిబి డైరెక్టర్ ఎకె ఖాన్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మైనార్టీల సంక్షేమం పట్ల గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. మైనార్టీల సంక్షేమానికి అవసరమైనన్ని నిధులను ప్రభుత్వం కేటాయిస్తుందని, వాటిని ఖర్చు చేసే బాధ్యత అధికారులపైనే ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్యాక్రాంతం అయిన వక్ఫ్ భూములను గుర్తించి తిరిగి వక్ఫ్ బోర్డుకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ అవసరాల కోసం జిహెచ్‌ఎంసి వాడుకున్న వక్ఫ్ భూములకు సంబంధించిన నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముస్లిం యువత అంటే ఎలక్ట్రీషియన్, మెకానిక్, ప్లంబర్ పనులు చేసేవారు కాదని, వారిని గొప్ప గొప్ప కాంట్రాక్టర్లుగా చూడాలని ఉందని ముఖ్యమంత్రి అన్నారు. మైనార్టీ యువతకు టిఎస్ ఐ-పాస్ కింద ఐటీ పార్క్‌లను ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. హుస్సేని షావలి దర్గా, బియా బాని దర్గా, ఫకీర్ ముల్లా దర్గా తదితర దర్గాలకు చెందిన భూములు అన్యాక్రాంతం కాకుండా వెంటనే సర్వే నిర్వహించి వక్ఫ్ బొర్డుకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మక్కా మసీదు కట్టడానికి సంబంధించిద పునరుద్ధరణ పనులు రంజాన్ పండుగలోపు పూర్తి చేయాలని సూచించారు. ఏప్రిల్ నెలలో నిర్వహించే పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో ముస్లిం యువతకు భాగస్వామ్యం కల్పించేందుకు శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జూన్ నెలలో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. షాదీ ముబారక్ పథకం ద్వారా 26,635 మంది లబ్ధిపొందడం పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. దారుల్ ఉల్ మ్‌లో ఆడిటోరియం నిర్మాణానికి రూ. 10 కోట్లు కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. మైనార్టీ విద్యార్థుల ఫీజర రియింబర్స్‌మెంట్ మొత్తాన్ని మార్చి 31 నాటికి పూర్తిగా చెల్లించాలని ఆదేశించారు. అర్హులైన ముస్లిం పేదలు అందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

చిత్రం... మైనార్టీ సంక్షేమం బడ్జెట్ ప్రతిపాదనలపై నిర్వహించిన సమీక్షలో ఒవైసీ బ్రదర్స్‌తో ముఖ్యమంత్రి కెసిఆర్