తెలంగాణ

తలసానికి కెసిఆర్ కితాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణలో పాడిపరిశ్రమాభవృద్ధిపై త్వరలో కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తామని అన్నిపార్టీలు, డెయిరీ నిపుణుల అభిప్రాయాలను స్వీకరిస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బాగా పని చేస్తున్నారని, తెలంగాణలోని చెరువుల్లో 4కోట్లకు పైగా చేపపిల్లల పెంపకానికి అద్భుతంగా పనిచేశారని కితాబునిచ్చారు. గురువారం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బదులిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తలసానికి గతంలో కమర్షియల్ ట్యాక్స్ మంత్రి పదవి ఇచ్చారని, వాస్తవానికి ఆ శాఖలో పెద్దపని ఉండదన్నారు.
అందుకే పనిచేసే మత్స్యశాఖ ఇచ్చానన్నారు. తలసాని తన పనితనాన్ని నిరూపించుకుని మత్స్య, పాడిపరిశ్రమ అభివృద్ధికి బాగా కృషి చేస్తున్నారన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశం నాటికి సంపూర్ణ ప్రణాళిఖ ఖరారు కావాలన్నారు. రాష్ట్రంలో పాలకు విపరీతమైన డిమాండ్ ఉందని, అందుకే బెంగళూరు, గుజరాత్ నుంచి వచ్చిన సంస్ధలు ఇక్కడ పాల విక్రయాలు చేస్తున్నాయ్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే పాల ఉత్పత్తి అధికంగా జరిగేటట్లు చర్యలు తీసుకుంటామన్నారు. తొలుత మంత్రి తలసాని బదులిస్తూ పాడి పశువుల పంపిణీ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లను మంజూరు చేసిందన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పశువుల అధికంగా పాలు ఇచ్చేందుకు చట్టం ఆమోదించని అనేక ఇంజెక్షన్లను పాడి పశువులకు ఇస్తున్నారని, దీని వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.