తెలంగాణ

నేరాలు తగ్గాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణలో ఈఏడాది నేరాలు తగ్గాయి. గత ఏడాది కంటే ఈ సంవత్సరం క్రైంరేటు కూడా తగ్గింది. గురువారం నేరాలపై వార్షిక నివేదికలో డిజిపి అనురాగ్ శర్మ వెల్లడించారు. రాష్టవ్య్రాప్తంగా 95,124 కేసులు నమోదు అయ్యాయి. 872 హత్య, 1,138 అత్యాచార, 7,338చీటింగ్, 958చైన్ స్నాచింగ్, 50దోపిడీలు, 594 దొంగతనాలు, 753 కిడ్నాప్, 665 పిడి యాక్టు కేసులు నమోదయ్యాయి. అయితే ఎస్సీ, ఎస్టీ కేసులు గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 8.5శాతం పెరిగాయి. ఆర్థిక నేరాలు 9.37శాతం, చీటింగ్ కేసులు 8.66శాతం, నమ్మకద్రోహం 17.09 శాతం పెరిగాయి. నిరుడు 21 బ్యాంక్ దోపిడీ కేసులు నమోదుకాగా, ఈ ఏడాది నవంబర్ నాటికి 18 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఏటిఎంల చోరీ కేసులు గత సంవత్సరంతో పోలిస్తే 8.65శాతం తగ్గాయి. సైబర్ నేరాలు ఈ ఏడాది 513 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మహిళలపై 6,103 కేసులు నమోదు కాగా, వరకట్న మృతులు 221 జరిగాయి. వేధింపులు 494, 50 డౌరీ హత్య కేసులు నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాలు గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 8 శాతం పెరిగాయి. గత సంవత్సరంలో 17,999 రోడ్డు ప్రమాదాలు జరుగగా, ఈ ఏడాది 19,395 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రోడ్డు ప్రమాద మృతులతో పోలిస్తే 2 శాతం తగ్గింది. 2015లో 5,725 మంది మృతి చెందగా, 2016లో 5,563 మంది మృతి చెందారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువ శాతం జాతీయ రహదారుపై, ఔటర్ రింగ్‌రోడ్డులపై జరిగాయని డిజిపి అనురాగ్ శర్మ వెల్లడించారు. ప్రమాదాల నివారణకు జాతీయ రహదారులపై 15 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇప్పటికే రెండు ఔట్ పోస్టులను వికారాబాద్ జిల్లాలోని మనె్నగూడ, కొడంగల్‌లలో వరల్డ్ బ్యాంక్ స్కీంలో చేపట్టామని, త్వరలో ఇవి పూర్తికానున్నాయని తెలిపారు.