తెలంగాణ

కౌన్సిల్‌లో కాంగ్రెస్ వాకౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు, ప్రజల ఆరోగ్యం పట్టించుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలో ప్రబలుతున్న అంటు వ్యాధులు, రోగుల ప్రాణాలతో చెలగాటం అడుతున్న వైద్యులపై తీసుకుంటున్న చర్యలను సభలో వెల్లడించాలని శుక్రవారం శాసన మండలిలో డిమాండ్ చేసిన కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వం నుండి సరైన సమాధానం రాకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. సభలో అధికంగా వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన ప్రశ్నలు చర్చకు రావడంతో, వాటిపై సంబంధిత మంత్రి సరైన సమాధానం ఇవ్వలేదంటూ ప్రతిపక్ష నాయకుడు మహ్మద్ షబ్బీర్ అలీతో పాటు ఆ పార్టీ సభ్యులు సభ నుండి వాకౌట్ చేసి నిరసన వ్యక్తం చేశారు. నరుూంకు సంబంధించిన కేసులో రాజకీయ నాయకులు, పోలీసులు అధికారులను ఒక్కరిని కూడా ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. నరుూంను పోషించింది, పెంచింది గత ప్రభుత్వాలంటూ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బదులిచ్చారు. ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నామని, బాధ్యులు ఎంతటి వారైనా వదిలేది లేదని మంత్రి స్పష్టం చేశారు.