తెలంగాణ

భూసేకరణ బిల్లును ఉపసంహరించుకోవాలి: సిపిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: టిఆర్‌ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించుకున్న భూసేకరణ బిల్లు పరమ నికృష్టమైందని, రైతాంగ వ్యతిరేకమైందని, ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ బిల్లును రాష్టప్రతి ఆమోదిస్తే కేంద్ర చట్టంలో రక్షణ కల్పిస్తూ పొందుపర్చిన రైతులు, వ్యవసాయ కూలీల, చేతివృత్తుల తదితరప్రజల పునరావాసం, సెటిల్‌మెంట్ జిల్లా కలెక్టర్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుందన్నారు. రైతుల భూమలను బలవంతంగా స్వాధీనపరుచుకునే అధికారాన్ని ఈ బిల్లు ద్వారా ప్రభుత్వానికి దక్కుతాయన్నారు. పునరావాసం రైతులకు మెరుగైన పునరావాసం, నష్టపరిహారం గురించి స్పష్టం చేయలేదన్నారు. రైతులను, వ్యవసాయ కూలీలను బిల్లు ద్వారా ప్రభుత్వం బజారున పడవేస్తుందన్నారు. రాష్ట్ర స్థాయి భూసేకరణ చట్టం 2013 భూసేకరణ చట్టస్ఫూర్తితో ఆ చట్ట పరిధిలో ఉండాలని సిపిఐ రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా న్యాయస్థానాల జోక్యాన్ని కూడా కోరాలని సిపిఐ తీర్మానించింది. ప్రైవేట్ వర్శిటీల ఏర్పాటు ఆలోచన విరమించుకోవాలన్నారు. అటవీ హక్కుల చట్టంపై కెసిఆర్ వక్ర భాష్యం చెబుతున్నారని సిపిఐ ఆరోపించించి. ఈ వివరాలను సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.