తెలంగాణ

క్యాబ్ డ్రైవర్ల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఖైరతాబాద్, డిసెంబర్ 30: తమ న్యాయపరమైన డిమాండ్లను సాధించుకునేందుకు శుక్రవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ సమ్మెలోకి వెళుతున్నారు. ఓలా, ఉబెర్ సంస్థల నిరంకుశ పోకడలకు నిరసనగా తాము సమ్మెలోకి వెళుతున్నట్టు తెలంగాణ క్యాబ్స్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. సదరు సంస్థల ప్రకటనలతో ఆకర్షితులైన కారు డ్రైవర్లు ఆస్తులను అమ్ముకొని, అప్పులు చేసి మరీ కార్లను కొనుగోలు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. మొదట భాగస్వాములుగా చేస్తామని చెప్పిన సంస్థలు 18 గంటలు తమతో పనిచేయించుకుంటూ తమనుంచే కమీషన్లు తీసుకుంటున్నాయని తెలిపారు. షేర్ బుకింగ్ విధానాలతో పాటు ఇటీవల టూ వీలర్ సర్వీసులను అందుబాటులోకి తేవడంతో క్యాబ్ డ్రైవర్లు ఆర్థికంగా చితికి పోతున్నారని చెప్పారు. తెలంగాణ సిద్ధించిన తరువాత తమ జీవితాలు మెరుగవుతాయని భావించామని, అందుకు విరుద్ధంగా ఇక్కడి ప్రభుత్వం సైతం బహుళజాతి సంస్థలకు కొమ్ముకాస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.