తెలంగాణ

అటకెక్కిన టిఆర్‌ఎస్ కమిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: గత నవంబర్‌లోనే సిద్ధమైన టిఆర్‌ఎస్ పార్టీ కమిటీలు, నామినేటెడ్ పదవులకు ఇంకా మోక్షం లభించలేదు. 2015 ప్లీనరీలోనే నామినేటెడ్ పదవుల పంపకం చేస్తామని సిఎం ప్రకటించినా అమలుకు నోచుకోలేదు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే పేరుతో జిల్లా కమిటీల ఏర్పాటును వాయిదా వేశారు. మొత్తం 31 జిల్లాలకు కొత్త కమిటీల కోసం ఎమ్మెల్యేలు, ఎంపిలు, జిల్లా ముఖ్యనాయకుల నుంచి నివేదికలు తెప్పించుకుని కమిటీలను ఖరారు కూడా చేశారు. నవంబర్ ఐదు, ఆరవ తేదీ నాటికే కమిటీలు పూర్తయ్యాయి. నవంబర్ 8న కమిటీలను మీడియాకు విడుదల చేస్తారు అనే అనధికార సమాచారం కూడా మీడియాకు అందించారు. అదే రోజు ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేయటంతో సిఎం ఒక్కసారిగా కంగు తిన్నారు. ఆదాయం ఎంతగా పడిపోతుంది? పథకాల పరిస్థితి ఏమిటి? అనే ఆలోచనలో పడిపోయారు. మిగిలిన అంశాలన్నింటినీ పక్కన పెట్టారు. ఎప్పుడో ఖరారు చేసిన కమిటీలకు ఇంకా మోక్షం లభించడం లేదు. చివరకు కొత్త సంవత్సరం మొదటి నెలలోనైనా కమిటీలకు మోక్షం లభిస్తుందేమో అని పార్టీ నాయకులు ఆశిస్తున్నారు.కనీసం నామినేటెడ్ పదవులనైనా ఇస్తారనుకుంటే అదీ జరగలేదు. వందకు పైగా మార్కెట్ కమిటీ పాలక వర్గాలను నియమించారు. కానీ మిగిలిన నామినేటెడ్ పదవులపై దృష్టిసారించడం లేదు. నిరుడు ఏప్రిల్‌లో ఖమ్మంలో పార్టీ ప్లీనరీ జరిగినప్పుడు నెల లోపే నామినేటెడ్ పదవుల పందేరం పూర్తవుతుందని కెసిఆర్ ప్రకటించారు. కానీ పదవుల భర్తీ జరగలేదు.
ఇప్పటి వరకు ఆలయాల కమిటీలను కూడా నియమించలేదు. ఇప్పటి వరకు పార్టీ శ్రేణులనే ఆలయ కమిటీ పాలక వర్గంలో నియమించేవారు. కేవలం పార్టీ అని మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక భావనలు ఉన్నవారిని నియమించాలని భావిస్తున్నారు.