తెలంగాణ

బిజెపి క్షమాపణ చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 2: నోట్ల రద్దు ఘోరమైన తప్పిదమని, యాభై రోజుల్లో అన్ని కరెన్సీ కష్టాలు తీరుతాయని చెప్పిన ప్రధాని ప్రస్తుతం ఇంకా ప్రజల కష్టాలు కొనసాగుతుండడంతో దేశ ప్రజల ముందు సాగిలపడి బిజెపి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మహబూబ్‌నగర్‌లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి దేశ ఆర్థిక వ్యవస్థపై ముప్పేట దాడి చేశారని, నోట్ల రద్దు తర్వాత యాభైరోజుల్లో స్వర్ణతుల్యంగా ఉండబోతుందని చెప్పి ప్రజలను దగా చేశారని ఆరోపించారు. యాభైరోజుల్లో నరేంద్రమోదీ అవినీతి డబ్బును రాబట్టడంలో విఫలమయ్యారని, ఆ డబ్బు ఎక్కడుందో పసిగట్టలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు కారణంగా దేశం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశారని, అందుకు మరో మూడేళ్ల పాటు దేశం అభివృద్ధి మార్గంలో నడవలేని స్థితిలో పడిపోయిందన్నారు. ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని విదేశాలు కూడా తప్పుపట్టాయన్నారు. కేవలం 6 శాతం నల్లదనాన్ని బయటికి తీయడానికి 94 శాతం కరెన్సీని రద్దు చేసి తప్పుచేశారన్నారు. ఇంట్లో ఎలుకలు ఉంటే ఇంటికి కాల్చుకున్నట్లు మోదీ వ్యవహరించారని విమర్శించారు. ఆయన తీసుకున్న చర్య నిరంకుశమైందని, పుట్టబోయే బిడ్డతో మొదలుకుని చనిపోయే వృద్ధుడి వరకు నోట్ల రద్దు కారణంగా చాలా ఇబ్బందులు పడ్డారని, అపదృశ్యమైన కష్టాలు పడ్డారని అవి ఎవరికీ కనబడవన్నారు. ఇంకా బ్యాంకుల ముందు, ఎటిఎంల ముందు క్యూలైన్‌లు ఉన్నాయని, ఇందుకు బిజెపి నాయకత్వం సమాధానం చెప్పాలన్నారు. తాము బిజెపిని ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎందుకు కోరుకుంటున్నామంటే ఆ పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రి కాబట్టే ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. నోట్ల రద్దుపై మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఆరు నిమిషాల పాటు మాట్లాడిన మాటల్లో దేశ ఆర్థిక స్థితి గతి ఎలా ఉండబోతుందో సూటిగా చెప్పారన్నారు. ఆర్‌బిఐలో కరెన్సీ ముద్రణకు గ్లోబల్ టెండర్ ఇప్పుడే వేశారని, అయితే దేశంలో ఉండే పేపర్లు పనికి రావని దేశంలో ఉండే సిరా కూడా పనికి రాదని, ఆఖరికి ఆశించిన స్థాయిలో ప్రింటింగ్ మిషన్లు కూడా లేవని, ఆమెరికా, లండన్‌లాంటి దేశాల నుండి ప్రింటింగ్‌కు కరెన్సీ పేపర్ రావల్సి ఉందన్నారు. ఈ ఏడాది మే చివరి వరకు దేశ ప్రజలకు ఇలాంటి కష్టాలనే ఎదురుకోక తప్పదన్నారు. ప్రపంచదేశ చరిత్రలో నోట్లను రద్దు చేయడం ప్రధానమంత్రి పెద్ద తప్పుచేసి దేశ ప్రజల ముందు దోషిగా నిలబడ్డారని, ఆయన కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చడంలో ప్రధాని ఘోరంగా విఫలమయ్యారని, అందుకు నిరసనగా ఈ నెల 11న దేశ రాజధాని ఢిల్లీలో భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జైపాల్‌రెడ్డి తెలిపారు.

చిత్రం..మహబూబ్‌నగర్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి