తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలల పటిష్ఠతకు తోడ్పడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: ప్రభుత్వ పాఠశాలల పటిష్టతకు దాతలు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. జిల్లెలగూడ జడ్‌పిహెచ్‌ఎస్‌లో కంప్యూటర్ ల్యాబ్‌ను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లెలగూడ పాఠశాల సిఎల్‌ఆర్ ట్రస్టు సహకారంతో అద్భుతంగా రూపొందిందని, అలాగే రంగారెడ్డి జిల్లాలోని అన్ని పాఠశాలలు అభివృద్ధి బాధ్యతను ప్రజాప్రతినిధులే తీసుకోవాలని సూచించారు. గత రెండున్నరేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. ముఖ్యమంత్రి తనకు అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా అమలుచేసేందుకు పూర్తి ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. ఇందుకు స్థానిక నేతల సహకారం కూడా కావాలని సూచించారు. తెలంగాణ విద్యావ్యవస్థ దేశానికే తలమాణికం చేయాలన్న తలంపుతో సిఎం ఉన్నారని , ఆ లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక వసతులకు పెద్ద పీట వేస్తున్నామని, జిల్లెలగూడ స్కూల్‌కు ఆరు అదనపు గదులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఎంపి విశే్వశ్వరరెడ్డి 24 కంప్యూటర్లను అందిస్తారని, అదనపు గదులు కావల్సిన ఫర్నీచర్‌ను సిఎల్‌ఆర్ ట్రస్టు సమకూరుస్తుందని చెప్పారు. విద్యార్ధులకు నిఘంటువులు, ఎగ్జామ్ ప్యాడ్‌లను, క్యాష్ అవార్డులను ఈ సందర్భంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపి విశే్వశ్వరరెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు జనార్ధనరెడ్డి, పల్లారాజేశ్వరరెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.