తెలంగాణ

అంధవిశ్వాసాలను వదలండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఉప్పల్, జనవరి 2: దేశాభివృద్ధికి శాస్ర్తియమైన పరిశోధన ఫలాలు ఎంతో అవసరమని సిసిఎంబి వ్యవస్థాపకుడు, ప్రముఖ శాస్తవ్రేత్త డాక్టర్ పిఎం భార్గవ అన్నారు. తెలంగాణ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సోమవారం ఉప్పల్ ప్రశాంతినగర్‌లో ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో జరిగే జాతీయ సైన్స్ కాంగ్రెస్‌పై విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సైన్స్ కాంగ్రెస్ అజెండాలో చేర్చాల్సిన అంశాలతో కూడిన డిక్లరేషన్‌ను జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు ప్రొఫెసర్ ఎం.ఆదినారాయణ, బిఎన్‌రెడ్డి, టి.రమేశ్, కాశప్ప, విద్యాసాగర్‌తో కలిసి ఆవిష్కరించారు. భార్గవ మాట్లాడుతూ సైన్స్‌కాంగ్రెస్‌లో ప్రజలు కోరుకునే విధంగా మేలు జరిగే చర్చలు జరగాలే తప్ప అశాస్ర్తియమైన అంశాలను ప్రోత్సహించడం తగదన్నారు. ఆధ్యాత్మికత, మూఢనమ్మకాలు, జ్యోతిష్య శాస్త్రం వంటి అంశాల చర్చలు అర్థం లేనివన్నారు. దేశంలో సైన్స్ ఎంతో అభివృద్ధి చెందుతుందని, సైన్స కాంగ్రెస్ సమావేశాల్లో ప్రజలకు ఏవిధమైన అంశాలు ఉపయోగపడుతాయో చర్చించాల్సిందిపోయి అశాస్ర్తియమైన అంశాల వైపు కేంద్రీకరించడం దురదృష్టకరమన్నారు. ఈ నెల 3 నుంచి 7 వరకు నిర్వహించే సైన్స్ కాంగ్రెస్ సమావేశాల అజెండాలో ఆహారం-వ్యవసాయం, ప్రజారోగ్యం-పరిశుభ్రత, గ్రామీణ సాంకేతికత-వృత్తిదారులు, పిల్లలు-మహిళల ఆరోగ్యం, పట్టణ రవాణ రంగం-గృహ నిర్మాణం, భారతీయ వైవిధత-లౌకికత, జాతీయ సహజ వనరుల రక్షణ-కొనసాగే అభివృద్ధి, అక్షరాస్యత-సైన్స్ విద్యారంగం, శాస్ర్తియ దృక్పథం-అంధ విశ్వాసాల నిరసన వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

చిత్రం..సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో చేర్చాల్సిన అంశాలతో కూడిన డిక్లరేషన్‌ను ఆవిష్కరిస్తున్న డాక్టర్ పిఎం భార్గవ, జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు