తెలంగాణ

స్ఫూర్తిదాయకంగా ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదేవ్‌పూర్, జనవరి 3: సిఎం దత్తత గ్రామాలో నిర్మించిన డబుల్ బెడురూం ఇళ్లు దేశానికే స్ఫూర్తిదాయకమని కేంద్ర క్రీడల మంత్రి విజయ్‌గోయల్ పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం సగం నిధులు కేటాయిస్తుందన్నారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండల పరిధిలోని ఎర్రవల్లి, నర్సన్నపేటలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు, పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆధునాతన పరిజ్ఞానంతో కేవలం రూ. 5లక్షలతో నిర్మిస్తున్న రెండు పడకల ఇళ్లు అందంగా ఉన్నాయని కితాబునిచ్చారు. ఇదే మోడల్‌లో అన్ని రాష్టల్రో పేదలకు ఇళ్లు నిర్మించే విధంగా ప్రధాని నరేంద్రమోదీకి వివరించనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే రద్దయన పెద్ద నోట్లతో పాటు నగదు రహిత లావాదేవీల కోసం తెలంగాణ సిఎం చేస్తున్న కృషిని అభినందించారు. తెలంగాణకు అని విధాలుగా కేంద్ర సహకారం ఎల్లప్పుడు ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహాకారంతో ముందుకెళ్తున్న తెలంగాణలో వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవటం సంతోషించదగ్గ విషయమని ప్రశంసించారు. రాష్ట్రంలో 80 గ్రామాలను క్యాష్‌లెస్ గ్రామాలుగా మార్చటం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో చేవేళ్ల ఎంపి విశే్వశ్వర్‌రెడ్డి, మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ బుర్ర వెంకటేశం, కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, జెసి హన్మంతరావు, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ఎర్రవల్లిలో డబుల్ బెడ్‌రూం ఇళ్లను పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి విజయ్‌గోయల్