తెలంగాణ

ఒప్పంద లెక్చరర్లకు జనవరి నుండి కొత్త వేతనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న ఒప్పంద లెక్చరర్లకు కొత్త వేతనాలను జనవరి నెల నుండి అమలుచేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. మంగళవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఇప్పటికే కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలను ఏ విధంగా పెంచాలో వివరిస్తూ జీవో 14 జారీ చేశామని అన్నారు. ఇప్పుడున్న వేతనం కంటే 50 శాతం మించకుండా అదనపు వేతనం ఇవ్వాలని దీనిలో పేర్కొన్నట్టు చెప్పారు. 3687 జూనియర్ కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారని, 18వేల నుండి 27వేల రూపాయిలు వేతనం ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు. 926 మంది డిగ్రీ కాలేజీల్ల్లో పనిచేస్తున్నారని 20,700 నుండి వారికి 31,050రూపాయిలకు వేతనం పెంచామని అన్నారు. ఈ ప్రాసెస్ ప్రారంభించిన క్రమంలో ఉస్మానియా జాక్ నేతలు కొంత మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, దాంతో ఈ ప్రక్రియ ఆగిందని చెప్పారు. కోర్టు అనుమతి తీసుకోమని ప్రభుత్వం అధికారులకు సూచించిందని, క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.