తెలంగాణ

మాట్లాడనివ్వటం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: శాసన సభలో అధికార పక్షం మినహా మిగిలిన వారికి మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదని, దీనిపై సభలో ప్రశ్నిద్దామని ఎంఐఎం శాసన సభాపక్షం నాయకుడు అక్బరుద్దీన్‌ను టిడిపి శాసన సభాపక్షం నాయకుడు రేవంత్‌రెడ్డి కోరారు. మిషన్ కాకతీయ, హరిత హారం, మత్స్య శాఖ ఏ అంశంపైనైనా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతిపక్షాల నుంచి ఎవరికీ అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. తనకు మాట్లాడే అవకాశం దక్కడం లేదని అక్బరుద్దీన్‌కు చెప్పారు. కెసిఆర్, కెటిఆర్, హరీశ్‌రావు ఈముగ్గురే సభలో మాట్లాడడం మిగిలిన వారు వినడంకే పరిమితం కావలసి వస్తోందని అన్నారు. మండలిలో కెటిఆర్ ఉంటే హరీశ్‌రావు శాసన సభలో ఉంటారని, శాసన సభలో కెటిఆర్ ఉంటే మండలిలో హరీశ్‌రావు ఉంటారని విమర్శించారు. అవకాశం ఇస్తామని చెప్పిన తరువాత కూడా ఇవ్వలేదని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ విధానానికి ఎక్కడో ఒక చోట పుల్‌స్టాప్ పెట్టాలని, సభలో అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తీసుకు వద్దామని అక్బరుద్దీన్‌తో రేవంత్‌రెడ్డి చెప్పారు.