తెలంగాణ

ఆస్కి డైరెక్టర్ జనరల్‌గా ఖ్వాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కి) డైరెక్టర్ జనరల్‌గా 1976 బ్యాచ్ సీనియర్ ఐఎఎస్ అధికారి రాజెన్ హబీబ్ ఖ్వాజా బాధ్యతలు స్వీకరించారు. 38ఏళ్ల పాటు సేవలు అందించిన ఖ్వాజా 2014లో రిటైరయ్యారు. పర్యాటక శాఖ, గనుల శాఖ కార్యదర్శిగానూ, సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఎండిగానూ పనిచేశారు. 1956 నుండి ఆస్కి తన సేవలను అందిస్తోందని, అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ అందించడంలో ఆస్కి ముందంజలో ఉందని ఈ విషయంలో మరింత మెరుగైన సేవలకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న సింగరేణి బొగ్గు గనుల సంస్థను ఆయన లాభాల బాటలోకి తీసుకురావడంలో విశేష కృషి చేశారు.