తెలంగాణ

తెలంగాణకు పెండింగ్ నిధులు విడుదల చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ నుండి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు విడుదల చేయాలని మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ని కేంద్ర కార్మిక శాఖమంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై నరేంద్ర తోమర్‌తో మంగళవారం నాడు దత్తాత్రేయ చర్చించారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం,జాతీయ గ్రామీణ త్రాగునీటి సరఫరా పథకాలకు గాను తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరారు. అలాగే గ్రామీణ త్రాగునీటి సరఫరా పథకాల అమలుపై హైదరాబాద్ వచ్చి సమీక్ష జరపాలని దత్తాత్రేయ కోరారు.