తెలంగాణ

7నుంచి జాతీయ అటవీ క్రీడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: తెలంగాణలో తొలిసారిగా అఖిలభారత అటవీ క్రీడోత్సవాలు నిర్వహించనున్నారు. ఈనెల ఏడు నుంచి 11వ తేదీ వరకు ఈ క్రీడలు తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ శాఖతో పాటు 28 రాష్ట్రాల అటవీ శాఖల నుండి , ఏడు ప్రతిష్టాత్మకమైన అటవీ సంస్థల నుండి సుమారు 2500 మంది అటవీ అధికారులు, సిబ్బంది ఈ క్రీడల్లో పాల్గొంటారని మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో బిసి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో జనవరి ఏడవ తేదీన సాయంత్రం 4.30కి ఈ క్రీడలను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభిస్తారు. 395 మంది మహిళలు, 1922 మంది పురుషులు ఇప్పటి వరకు మొత్తం 2317 మంది క్రీడాకారులు, 62 అంశాల్లో పోటీ పడేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. 83 రకాల క్రీడలను నిర్వహిస్తారు, వీటిలో 158 క్రీడాంశాలు పురుషులకు, 79 క్రీడాంశాలు మహిళలకు సంబంధించినవి. ఈసారి క్రీడల్లో కొత్తగా అథ్లెటిక్స్, క్యారమ్స్, స్క్వాష్ , వెయిట్ లిఫ్టింగ్, బాస్కెట్ బాల్, వాలీబాల్ పోటీలను చేర్చారు. అన్ని రాష్ట్రాల ప్రధాన ముఖ్య అటవీ సంరక్షకులు, అటవీ దళాధిపతులు, రాష్ట్ర ప్రభత్వు అటవీ కార్యదర్శులు ఈ క్రీడోత్సవాల్లో పాల్గొంటారు. 23వ అఖిల భారతీయ అటవీ క్రీడోత్సవాలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలు విడుదల చేసింది.