తెలంగాణ

బీబీనగర్ ఎయిమ్స్‌కు నిధులివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: తెలంగాణలో ప్రతిపాదించిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థకు నిధులు కేటాయించాలని, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) సంస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు, లోక్‌సభలో పార్టీ పక్ష నాయకుడు జితేందర్ రెడ్డి, లోక్‌సభ సీనియర్ సభ్యుడు బి.వినోద్‌కుమార్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీని కోరారు. టిఆర్‌ఎస్ నాయకులు మంగళవారం జైట్లీని ఆయన కార్యాలయంలో కలుసుకుని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలు ముఖ్యంగా రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయటం గురించి చర్చించారు. ఎయిమ్స్, ఐఐఎం, సిఎస్‌టి, నీటిపారుదల ప్రాజెక్టులకు అదనపు నిధులు కేటాయించటం వంటి నాలుగు ముఖ్యమైన అంశాల గురించి జైట్లీతో చర్చించినట్లు కేశవరావు చెప్పారు. ఆఖరున ఒక కీలక విషయం గురించి కూడా జైట్లీతో చర్చించినట్లు విలేఖరులకు చెప్పిన కేశవరావు అదేమిటో వెల్లడించేందుకు నిరాకరించటం గమనార్హం.
ఎయిమ్స్‌ను బీబీనగర్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, దీనికి అవసరమైన రికరింగ్, మూల పెట్టుబడులను కేటాయించాలని జైట్లీని కోరినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన పది,పదిహేను సమస్యలను ఇంకా పరిష్కరించుకోవలసి ఉన్నదని కేశవరావుతెలిపారు. ప్రస్తుతం తాము నాలుగు ముఖ్యమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించామన్నారు. ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఇంతవరకు కేవలం తొంబై కోట్లు ఇచ్చిందని, అయితే తాము 300కోట్లు కేటాయించాలంటున్నామని కేశవరావు చెప్పారు. తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు చేయాలని ఆర్థికమంత్రిని కోరామన్నారు. తెలంగాణాలో ఇతర అన్ని రకాల విద్యా సంస్థలు ఉన్నా ఐఐఎం లేకపోవటం వలన ఒక లోటు కనిపిస్తోందని, ఈ లోటును భర్తీ చేయాలంటే ఐఐఎం ఏర్పాటు అవసరమని తాము వివరించామన్నారు. విభజన చట్టంలో తెలంగాణకు దీనిని కేటాయించనంత మాత్రాన ఇప్పుడు ఏర్పాటు చేయకూడదనే నిబంధనేదీ లేదని కేశవరావు చెప్పారు. దీనికి జైట్లీ సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. కాకతీయ తదితర నీటిపారుదల ప్రాజెక్టులకు నాబార్డ్ నుండి నిధులు కేటాయించాలని, సిఎస్‌టి గురించి కూడా వివరించామని కేశవరావు తెలిపారు.