తెలంగాణ

నేడు ముంబయికి సిఎం కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గోదావరిపై నిర్మించే ఐదు ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్టత్రో ఒప్పందం కుదుర్చుకోవడానికి సిఎం కె చంద్రశేఖర్‌రావు సోమవారం ఉదయం 10.45కు ముంబయి వెళ్తున్నారు. సోమవారం రాజ్‌భవన్‌లో బస చేస్తారు. మంగళవారం రెండు రాష్ట్రాల సిఎంల సమక్షంలో ఒప్పందాలు కుదురుతాయి. ప్రత్యేక విమానంలో సిఎం కెసిఆర్‌తో పాటు నీటిపారుదల మంత్రి టి హరీశ్‌రావు సహా అధికారులు ఉంటారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్ర వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలపై సిఎం కెసిఆర్ దృష్టి సారించారు. అధికారుల బృందం, నీటిపారుదల శాఖ మంత్రితోపాటు సిఎం రెండుసార్లు మహారాష్టక్రు వెళ్లి సిఎంతో చర్చించారు. రెండు రాష్ట్రాలు సామరస్య పూర్వకంగా ఒప్పందం కుదుర్చుకోవడానికి నిర్ణయించాయి. దశాబ్దాల నుంచి రెండు రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులు వివాదంలో మునిగిపోయాయి. గోదావరి, పెన్‌గంగ, ప్రాణహిత నదులపై నిర్మించే ఐదు ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదురుతోంది. గతంలో బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ఉమ్మడి ఆంధ్ర, మహారాష్టల్ర మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు మహారాష్ట్ర సరిహద్దులో ధర్నాకు దిగడంతో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి వివాదాస్పద వైఖరితోకాకుండా రెండు రాష్ట్రాలకు నష్టం కలగకుండా రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునేలా ఒప్పందం కోసం సిఎం కృషి చేశారు. తెలంగాణ అధికారులు మహారాష్టక్రు వెళ్లారు. అదేవిధంగా హైదరాబాద్‌లో జరిగిన చర్చల్లో మహారాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. గోదావరి, పెన్‌గంగ, ప్రాణహిత నదులపై నిర్మించే ఐదు బ్యారేజీలపై ఇరు రాష్ట్రాలు ఒప్పందాలు చేసుకుంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు వరప్రసాదం లాంటిది. కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు మొత్తం ఐదు ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించింది. అనేక చర్చల తరువాత ఒప్పందాలకు సిఎం కెసిఆర్‌ను మహారాష్ట్ర సిఎం ఫడ్నవీస్ ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకు కెసిఆర్ బృందం సోమవారం ముంబయి వెళుతోంది. తెలంగాణకు చెందిన మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు సోమవారం కెసిఆర్ బృందానికి రాజ్‌భవన్‌లో ఆతిథ్యం ఇవ్వనున్నారు. దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్న ప్రాజెక్టులకు మోక్షం లభించడంతో తెలంగాణ ప్రభుత్వం దీనిని చారిత్రక ఒప్పందాలుగా భావిస్తోంది. ఒప్పందం కోసం స్వయంగా ముఖ్యమంత్రి మహారాష్ట్ర వెళుతున్నారు. ఈ ఒప్పందాలతో ముఖ్యమంత్రిని మంత్రులు అపర భగీరథుడు అని అభినందించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ఒప్పందాలపై ఆదివారం గవర్నర్‌కు వివరించారు.
chitram...
మహారాష్ట్ర టూర్‌కి బయలుదేరేముందు
గవర్నర్ నరసింహన్‌ను కలిసిన సిఎం కెసిఆర్