తెలంగాణ

విద్యార్థులకు ఆరోగ్య కార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: రాష్ట్రంలో విద్యార్థులు అందరికీ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద ఆరోగ్య పరీక్షలు చేయించి హెల్త్ కార్డులు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరానికి పాఠశాలల వారీ సూక్ష్మస్థాయి ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన చెప్పారు. మంగళవారం నాడు ఆయన విద్యాశాఖ వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ఏడాది నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన ఫలితాలపై ఆయన అధికారులతో ఈ సమీక్ష చేశారు.
వచ్చే విద్యాసంవత్సరంలో ఫలితాలు మరింత మెరుగుపడేందుకు ప్రతి విభాగం ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. 2017-18 విద్యాసంవత్సరానికి సంబంధించి మార్చిలోనే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని, జూన్‌లోగా యూనిఫారాలు అందించాలని సూచించారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఇక నుండి ఏ నెలలో బిల్లులను ఆ నెలలోనే అందించాలని అన్నారు. విద్యాసంస్థల్లో వౌలిక వసతులకు పెద్ద పీట వేస్తూనే విద్యా ప్రమాణాలను పెంచడంపై శ్రద్ధ వహించాలని అన్నారు. విద్యాప్రమాణాలను మెరుగుపర్చడంలో భాగంగా ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల నమోదు పెరగాలని చెప్పారు. అదే విధంగా వచ్చే పరీక్షల్లో ఫలితాలు కూడా గత ఏడాది కంటే ఎక్కువ రావాలని చెప్పారు. ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని సూచించారు. విద్యాశాఖను దశల వారీ ఆన్‌లైన్ పద్ధతిలోకి తెచ్చేందుకు కూడా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. పదిహేను రోజుల్లో వీటికి సంబంధించిన ప్రణాళికలు ఇవ్వాలని కోరారు. సమావేశంలో స్పెషల్ సిఎస్ రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్యా కమిషనర్ వాణీ ప్రసాద్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, ఇతర విభాగాల అధిపతులు హాజరయ్యారు.