తెలంగాణ

హోర్డింగ్‌లు ఓకె.. పెట్టేవారెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: రాష్ట్ర రాజధానితో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, విధానాలను ప్రజలకు తెలియచేసేందుకు భారీ హోర్డింగులను ఏర్పాటు చేస్తున్నారని, అయితే వీటిని ఎవరు ప్రదర్శిస్తున్నారో హోర్డింగ్‌లపై రాయడం లేదని శాసనమండలిలో విపక్షం నాయకుడు మహ్మద్ అలీ షబ్బీర్ ఆరోపించారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ‘జీరోఅవర్’లో షబ్బీర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను ఐ అండ్ పిఆర్ లేదా ఇతర శాఖలు, సంస్థల ద్వారా ప్రచారం చేసుకోవడానికి ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఈ హోర్డింగ్‌లను ఎవరు ఏర్పాటు చేస్తున్నారో అదే హోర్డింగ్‌పై రాస్తే వాస్తవ పరిస్థితి ప్రజలకు అర్థమవుతుందన్నారు.
కాగా ఆదిలాబాద్ (ప్రస్తుతం కొమురం బీం) జిల్లాలోని 229 గ్రామాలు/గూడేలకు తాగునీటిని అందించేందుకు సంబంధించిన ప్రాజెక్టును ప్రభుత్వం ఎల్ అండ్ టి కంపెనీకి అప్పచెప్పగా, పనుల్లో జాప్యం జరుగుతోందని పురాణం సతీష్ ఆరోపించారు. అంతకుముందు విపక్షాలు ఇచ్చిన వాయదా తీర్మానాలను చైర్మన్ స్వామిగౌడ్ తిరస్కరించారు.