తెలంగాణ

17న వరంగల్‌లో అంతర్జాతీయ పతంగుల పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 3: సంక్రాంతి పండుగ సందర్భంలో తెలంగాణ ప్రజలు అట్టహాసంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పతంగుల పండుగను వరంగల్‌లో అధికారికంగా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ప్రభుత్వం నిర్వహించిన పతంగుల పండుగ ఇప్పటి వరకు రాజధాని హైద్రాబాద్‌కు పరిమతం అవగా, ఈసారి వరంగల్ కేంద్రంగా అంతర్జాతీయ పతంగుల పండుగను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 17వ తేదీన నిర్వహించే పతంగుల పండగకు జిల్లాయంత్రాంగం సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్రానికి చెందిన ఔత్సాహికులతోపాటు 11మంది జాతీయస్థాయి ప్రతినిధులు, 31దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ పతంగుల పండుగలో పాల్గొంటారు. నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఈ పతంగుల పండుగ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే దేశ, విదేశాల ప్రతినిధులకు పర్యాటక శాఖకు చెందిన హరిత కాకతీయ హోటల్‌లో వసతి కల్పించాలని నిర్ణయించారు.