తెలంగాణ

123 జివో ప్రకారమే భూ సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: ప్రాజెక్టుల నిర్మాణంలో భూ సేకరణ కీలక అంశమని, కలెక్టర్లు భూ సేకరణ వేగవంతం చేయాలని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జోషి ఆదేశించారు. భూ సేకరణపై జిల్లా కలెక్టర్లతో జోషి మంగళవారం వీడియో నిర్వహించారు. భూ సేకరణ కోసం రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన 2013 భూ సేకరణ చట్ట సవరణ ముసాయిదాను జిల్లా కలెక్టర్లు అందరికీ పంపిస్తున్నట్టు చెప్పారు. అయితే చట్ట సవరణ బిల్లుకు రాష్టప్రతి ఆమోదం లభించే ప్రక్రియ కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని, జివో123 ద్వారా భూ సేకరణ వేగవంతం చేయాలని జోషి కలెక్టర్లకు తెలిపారు.
తమ జిల్లాల్లో ల్యాండ్ బ్యాంక్‌లు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. జివో 123 కింద జగిత్యాల, యాదాద్రి, పెద్దపల్లి జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ పనులు పూర్తి చేయాలని చెప్పారు. ఇరిగేషన్ పథకాలకు భూ సేకరణ కోసం భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలకు 50 కోట్ల రూపాయలు, నిర్మల్‌కు 100 కోట్లు, మెదక్ జిల్లాకు 40 కోట్లు, వనపర్తికి 25 కోట్ల రూపాయలు, మంచిర్యాలకు 20 కోట్లు, గద్వాలకు 60 కోట్లు, జగిత్యాలకు 37 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి జిల్లా కలెక్టర్లు పూనుకోవాలని చెప్పారు. వివిధ ప్రాజెక్టుల భూ సేకరణ కోసం జిల్లా కలెక్టర్ల వద్ద ఉంచిన 1700 కోట్లకు సంబంధించి ఇంత వరకు యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లు అందలేదని జోషి తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ మినహా మిగతా కలెక్టర్లు ఈ విషయంలో వెనకబడ్డారని అన్నారు. సకాలంలో యుసిలను పంపించక పోతే ఆ తర్వాత వేచ్చ ప్రతిపాదనలకు నిధుల విడుదల చేసే అర్హత రాదని జోషి తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్ చేయనున్నట్టు స్పెషల్ సిఎస్ జోషి తెలిపారు. భూముల రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను సంబంధిత ఇరిగేషన్ ఇఇలకు అందజేయాలని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. ఆయా ప్రాజెక్టుల పురోగతిని బట్టి భూ సేకరణ వేగవంతం చేయాలని చెప్పారు. భూ సేకరణ ప్రక్రియను బాటిల్‌నెక్‌గా భావించాలని అన్నారు. భూ సేకరణ అనంతరం నిర్వాసితులకు పునరావాసంకు ప్రాధాన్యత ఇవ్వాలని జోషి కలెక్టర్లకు సూచించారు.
మిషన్ కాకతీయ కింద చేపట్టిన రెండవ దశ ఇంకా పూర్తి కాని పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మిషన్ కాకతీయ రండవ దశ కింద చేపట్టిన పనులను జూన్ చివరి కల్లా పూర్తి చేయాలని చెప్పారు. మిషన్ కాకతీయ మూడవ దశ కింద పనులను నిర్ధారించి,వెంటనే చేపట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫీడర్ చానళ్లు, ఇతర పనులతో పాటు సాధ్యమైన చోట కొత్త చెరువుల నిర్మాణం చేపట్టాలని జోషి కలెక్టర్లకు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇరిగేషన్ శాఖ కార్యదర్శి వికాస్ రాజ్, శ్రీరాంసాగర్, దేవాదుల సిఇలు శంకర్, బి వెంకటేశ్వర్లు, భూ సేకరణ స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వరరావు, ఓఎస్‌డి శ్రీ్ధర్‌రావు దేశ్ పాండే పాల్గొన్నారు.