తెలంగాణ

ఇటుక బట్టీలపై ఆకస్మిక దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జనవరి 3: చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు శివారులోని 11 ఇటుక బట్టీ పరిశ్రమలపై మంగళవారం స్మైల్ టీమ్ బృందం భూదాన్‌పోచంపల్లి ఎస్‌ఐ రాఘవేంద్ర సారథ్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఇటుక బట్టీలలో పనిచేస్తున్న 150 మంది బాలకార్మికులను గుర్తించారు. వారంతా బాలకార్మికులు కాదని, తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారని యాజమాన్యాలు వాదిస్తున్నప్పటికీ అధికారులు తమపని తాము చేశారు. చౌటుప్పల్ ప్రాంతంలో కొంతకాలంగా ఇటుక బట్టీల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఒడిశా రాష్ట్రం నుంచి కూలీలను తీసుకువచ్చి ఇటుకలు తయారు చేసేందుకు బట్టీలు నిర్వహిస్తున్నారు. ఆ కార్మికులు బట్టీల వద్దే ఉండేందుకు గుడిసెలు ఏర్పాటు చేశారు. చిన్న పిల్లలతో పాటు కుటుంబాలు ఇక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసే గుడిసెల్లో నివాసం ఉంటూ ఇటుకలు తయారు చేసి పొట్ట పోసుకుంటున్నారు. వారి పిల్లలను బడికి పంపించి చదువులు చెప్పించకుండా చిన్నారులతో సైతం పనులు చేయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ‘ఆపరేషన్ స్మైల్’ బృందం ప్రతి ఏటా జనవరి, జూన్ మాసాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి బాలకార్మికులకు విముక్తి కల్పిస్తూంటుంది. అం దులో భాగంగానే స్మైల్ టీమ్ ఇటుక బట్టీలపై దాడులు నిర్వహించి 150 మంది బాలకార్మికులను గుర్తించింది. స్మైల్ టీమ్ బృందం సభ్యులు ఇటుక బట్టీల యజమానులు, తల్లిదండ్రులు, స్వచ్చంధ సంస్థలు, స్థానికుల నుంచి వివరాలు నమోదు చేసారు. చౌటుప్పల్ ఎసిపి ఎన్. స్నేహిత, సిఐ నవీన్‌కుమార్‌లు ఇటుక బట్టీల వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలకార్మికులతో పనులు చేయించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని సూచించారు.