తెలంగాణ

విద్యార్థినుల అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల అర్బన్, జనవరి 3: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో తెలంగాణ మోడల్ స్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. పట్టణ ఎస్‌ఐ వేణుగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం, శ్రీరాంపూర్‌కు చెందిన దేవీ కళాంజలి, టెకుమట్లలుకు చెందిన చిప్పకూర్తి పావని మంచిర్యాల పట్టణంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో సీఈసీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారని తెలిపారు. డిసెంబర్ 31న నూతన సంవత్సరం సందర్భంగా స్కూల్‌లోని విద్యార్థులందరూ తమ స్వంత గ్రామాలకు వెళ్లారని వీరు కూడా స్వంత గ్రామానికి వెళ్తున్నామని చెప్పడంతో వీళ్ల తల్లిదండ్రులు రాకపోవడంతో బత్తుల వర్ణ (బైపిసి) విద్యార్థినిని తీసుకెళ్లడానికి వచ్చిన ఆమె తల్లి బత్తుల వజ్ర వచ్చారని చెప్పారు. కళాంజలి, పావనీలను కూడా ఇంటికి తీసుకెళ్తానని బత్తుల వజ్ర రిజస్ట్రర్‌లో సంతకం చేయడంతో ప్రిన్సిపల్ స్కూల్ నుంచి పంపించారు. ఇంటికి వెళ్లిన విద్యార్థినులు ఈనెల 2న స్కూల్‌కు తిరిగి వచ్చారు కానీ, కళాంజలి, పావనిలు స్కూల్‌కు రాకపోవడం ప్రిన్సిపాల్ గాయత్రి తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. తమ పిల్లలు ఇంత వరకు ఇంటికి రాలేదని వారు సమాధానం ఇవ్వడంతో వెంటనే పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ప్రిన్సిపాల్ గాయత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వేణుగోపాల్ తెలిపారు.