తెలంగాణ

సినిమా చూస్తూ ప్రేక్షకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జనవరి 3 : సిద్దిపేటలోని శ్రీనివాస థియేటర్‌లో ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమా చూస్తూ ప్రేక్షకుడు మృతిచెందిన సంఘటన మంగళవారం జరిగింది. ఈ సంఘటనలో పట్టణంలోని ఎన్‌టిఆర్ నగర్‌కు చెం దిన షాదుల్ (28) మృతిచెందాడు. ఈవిషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బాధితులు కొద్దిసేపు ధియేటర్ వద్ద ఆందోళన చేపట్టారు. సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వివారాల్లోకి వెళితే.. సిద్దిపేట ఎన్‌టిఆర్ నగర్‌కు చెందిన షాదుల్ దినసరి కార్మికునిగా పనులు చేస్త్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం శ్రీనివాస థియేటర్‌లో కూర్చుని ఇంట్లో దెయ్యం నాకేం భయం అనే సినిమా చూస్తుండగానే తను కూర్చున్న కుర్చీలో షాదుల్ మృతిచెందాడు. సినిమా విశ్రాంతి సమయంలొ పక్కనే ఉన్న వారు లెపినా షాదుల్ లేవకపోవటం, మూత్రం పోసుకొని ఉన్నట్లు గుర్తించారు. తట్టి లేపినా ఎలాంటి అలికిడీ లేకపోవటంతో మృతిచెందినట్లుగా భావించి థియేటర్ యజమాన్యానికి తెలపగా వారు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వన్ టౌన్ ఎఎస్‌ఐ విఠల్, సిబ్బందితో వివరాలను సేకరించారు. మృతుని జేబులోని ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతునికి భార్య అబెదా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులతో వచ్చి థియేటర్ వద్ద కొద్ది సేపు ఆందోళన చేపట్టారు. మృతుని బంధువులు కుటుంబాన్ని ఆదుకోవాలని నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. యజమాన్యం పక్షాన మేనేజర్లు దయాకర్, నాగరాజులు సినీ డిస్టిబ్యూటర్, నిర్మాత దృష్టికి తీసుకెళ్లి ఆదుకుంటామన్నారు.అనంతరం మృతుని కుటుంబానికి 50 వేల పరిహారం ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం.