తెలంగాణ

క్యాబ్ డ్రైవర్లతో ప్రభుత్వం చర్చించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ముషీరాబాద్, జనవరి 3: ప్రభుత్వం అధికారికంగా ఊబర్. ఓలా క్యాబ్ డ్రైవర్లతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు.
తమ సమస్యలు పరిష్కరించాలని డి మాండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ క్యాబ్స్ అసోసియేషన్ జెఎసి ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ ఓలా, ఊబర్ విచిత్రమైన వ్యవస్థలని అన్నారు. ఇన్‌సెంటివ్‌ల కోసం రోజుకు కనీసం 18 గంటలు పని చేయాల్సి వస్తున్నదని అన్నారు. ఆర్‌టిఎ జోక్యం చేసుకుని మీటరింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. చాలా దేశాలలో నిరాదరణ, నిషేధానికి గురైన ఓలా, ఊబర్ సంస్థలు నగరంలో శ్రమదోపిడికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. క్యాబ్ డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో జెఎసి నాయకులు సిహెచ్. యాకయ్య, కె.ఆంజనేయులు, ఆర్.రాఘవేంద్ర, జి.వెంకటరంగారావు, ఎస్.గోపాల్‌రెడ్డి, కె. శ్రీనునాయక్ పాల్గొన్నారు.