తెలంగాణ

పేదలకు విద్యను దూరం చేస్తే ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఖైరతాబాద్, జనవరి3: తెలంగాణలో పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్రలపై సమష్టిగా ఉద్యమిద్దామని పలువురు వక్తలు పిలుపు నిచ్చారు.
మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విద్యా సంస్థల సమాఖ్య ఆధ్వర్యంలో ‘్ఫజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలి - పేద విద్యార్థులకు చేయూత నివ్వాలి’ అనే అంశంపై సదస్సును నిర్వహించారు. సమాఖ్య కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్, టిపిసిసి చైర్మన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, సిపిఐ కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి, ప్రొఫెసర్లు విశే్వశ్వరరావు, సత్యనారాయణ, బిజెపి నాయకులు సాంభమూర్తి, ట్రెస్మా సతీష్, గుజ్జ కృష్ణ తదితరులు ప్రసంగించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో ప్రైవేట్ కాలేజీల్లో సైతం విద్యాప్రమాణాలు అందించలేవని అన్నారు.
ప్రభుత్వం కార్పొరేట్ రంగాన్ని ప్రోత్సహిస్తే విద్యా రంగంలో అనేక ఇబ్బందులు తలెత్తుతాయని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ధనిక రాష్ట్రం అంటూనే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎందుకు చెల్లించడం లేదని అన్నారు. వాటర్‌గ్రిడ్‌కు 10 వేల కోట్లు, ఇరిగేషన్ పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు భారీగా చెల్లింపులు చేయడం వెనుక అసలు మతలబు ఏమిటని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కమీషన్ దొరకదనే ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆరోపించారు. ఇదే విషయమై అసెంబ్లీలో లేవదీస్తానని అన్నారు.
దేవాలయాలకు భారీగా కోట్లు కేటాయిస్తున్న కేసిఆర్ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మాత్రం మెండిచేయి చూపడం సరైంది కాదని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య దుయ్యబట్టారు. ఉద్దేశపూర్వకంగా ఫీజులను చెల్లించకుండా పేద విద్యార్ధులకు చదువులను దూరం చేసే కుట్రలకు ప్రభుత్వం తెరతీసిందని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నా స్పందించని ప్రభుత్వం కళాశాలలపై కరుణ చూపిస్తుందా అన్న సందేహం తలెత్తుతుందని అన్నారు.

చిత్రం..సదస్సులో అభివాదం చేస్తున్న ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, కోదండరామ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి