తెలంగాణ

కౌన్సిల్‌నుంచి కాంగ్రెస్ వాకౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 4: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వెనకడుగు వేసేది లేదని, దీనిపై విపక్షాలు, విద్యార్థులు, యాజమాన్యాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి శాసనమండలి (కౌన్సిల్)లో తెలిపారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. బుధవారం కౌన్సిల్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జరిగిన చర్చకు మంత్రి జగదీశ్ రెడ్డి సమాధానమిస్తూ తాము అధికారంలోకి వచ్చాక రూ. 4,687.72 కోట్లు విడుదల చేశామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు విద్యా ప్రమాణాలు పాటించని కళాశాలలన్నీ ఇప్పుడు మూతపడుతున్నాయని అన్నారు. పైరవీలు చేసుకుని అనుమతి తెచ్చుకున్న కళాశాలలే ఇప్పుడు మూతపడుతున్నాయని అన్నారు. కళాశాలలపై విజిలెన్స్ ఏర్పాటు చేస్తే ఎందుకు ఏర్పాటు చేశారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయని ఆయన తెలిపారు. విపక్షాలు చెబుతున్నట్లు ఎక్కడా విద్యార్థులు రోడ్డెక్కలేదని అన్నారు. తెలంగాణ విద్యార్థులు ఆంధ్రలో చదువుకుంటే అక్కడి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేసేలా, ఆంధ్ర విద్యార్థులు తెలంగాణలో చదువుకుంటే ఇక్కడ ఫీజు రీయింబర్స్‌మెంట్ చేసేలా ఇదివరకే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. కాగా ప్రభుత్వం రూ. 6,430 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. మజ్లిస్ ఎమ్మెల్సీ జాఫ్రీ మాట్లాడుతూ ప్రీ-మెట్రిక్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తారా? అని ప్రశ్నించారు. బిజెపి ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పెంచుతారా? అని ప్రశ్నించారు.