తెలంగాణ

ఎవరికి వారే.. యమునా తీరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5:్ఫజు రీయింబర్స్‌మెంట్ అంశంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనుకున్న కాంగ్రెస్‌కు సరైన వ్యూహం లేకపోవడం, ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించడంతో నవ్వుల పాలైంది. ఉదయం సభ ప్రారంభం కాగానే జానారెడ్డి లేచి.. నిన్నటి సభలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ అర్ధాంతరంగా ముగించి వాయిదా వేశారని, దానిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగియగానే ఫీజుల అంశంపై చర్చకు సిద్ధమని చెప్పారు. కాగా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడే చర్చించాలంటూ నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల తరువాత చర్చకు జానారెడ్డి సుముఖత వ్యక్తం చేసినా, కాంగ్రెస్ సభ్యులు అందుకు కొందరు ఇష్టపడలేదు. పైగా కొందరు కాంగ్రెస్ సభ్యులు వెనక బెంచీలో చేరి మంతనాలు సాగించడం పార్టీలో ఐకమత్యం లేమిని ఎత్తిచూపింది. చర్చ తరువాత ముఖ్యమంత్రి ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందక నిరసన వ్యక్తం చేసే అంశంలో సైతం కాంగ్రెస్ ఎవరిష్టం వాళ్లది అన్నట్టుగా వ్యవహరించారు. ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నామో భట్టి విక్రమార్క చెబుతుండగా, శాసన సభావ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు లేచి సాధారణంగా పార్టీ తరఫున నిరసన వ్యక్తం చేస్తారు. భట్టి వ్యక్తిగతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారో లేక కాంగ్రెస్ పార్టీ.. తమ శాసన సభాపక్ష నేతను మార్చిందో వివరణ ఇవ్వాలని కోరారు. దీంతో భట్టి విక్రమార్క కూర్చున్నారు. పార్టీ తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నట్టు చెప్పాలని ఆయన జానారెడ్డిని కోరారు. కానీ జానారెడ్డి లేవలేదు. మిగిలిన పార్టీ సభ్యులు కోరినా జానా లేవలేదు. దీంతో కొందరు సభ్యులు ఫక్కున నవ్వారు. జానారెడ్డి మైకులో మాట్లాడకుండా భట్టిని చూస్తూ పార్టీ తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నానని చెప్పడం మరో విశేషం. దీంతో ఎంఐఎం శాసనసభాపక్షం నాయకుడు అక్బరుద్దీన్ లేచి ముఖ్యమంత్రి సంతృప్తికరమైన సమాధానం ఇచ్చినందున నిరసన నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని ప్రతిపక్ష నాయకుణ్ని కోరుతున్నట్టు చెప్పారు.