తెలంగాణ

నోట్ల రద్దుపై మోదికి మద్దతు ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: నల్లధనాన్ని వెలికితీస్తామని, నకిలీ కరెన్సీకి చెక్ పెడతామంటూ కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేయటం అనాలోచిత నిర్ణయమని, దీంతో మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఈ నిర్ణయంతో ప్రజలు అష్టకష్టాలు పడుతూంటే ప్రధానికి ముఖ్యమంత్రి కేసిఆర్ మద్దతు ఇవ్వడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. పైగా కరెన్సీ సమస్యను సాకుగా చూపి రాష్ట్ర పథకాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు రుణాల మాఫీ చెల్లింపులవంటివి జాప్యం చేస్తున్నారని విమర్శించారు. పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ నగరంలో మాజీ మంత్రి దానం నాగేందర్ ఆధ్వర్యంలో గురువారం చార్మినార్ నుంచి గాంధీభవన్ వరకు ర్యాలీ జరిగింది. అనంతరం జరిగిన సభనుద్దేశించి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడారు. ప్రధాని తొందరపాటు నిర్ణయంతో సామాన్యులపై , చిన్న, మధ్య తరహా వ్యాపారులపై సర్జికల్ స్ట్రైక్ చేశారని అన్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత పరిస్థితి కుదుటపడేందుకు 50 రోజులు పడుతుందని ప్రధాని ప్రకటించినా, నేటికీ పరిస్థితుల్లో మార్పు రాలేదన్నారు.
కష్టాలు తీరేవరకు
ఉద్యమం : జైపాల్‌రెడ్డి
పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు, రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు తీరే వరకు మోదికి వ్యతిరేకంగా తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు. ప్రదాని మోది మాటల మనిషి అన్నారు. ఇక మాటలు చెప్పేందుకు అవకాశం లేదన్నారు. ఈ నిర్ణయంతో మోది విఫలం చెందారని, ఆయన దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి, పదవీ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దుతో ఎవరికి మేలు జరిగిందో ప్రధాని చెప్పాలన్నారు. మాజీమంత్రి దానం నాగేందర్ మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా తాము నిర్వహించిన ర్యాలీలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పాల్గొన్నారని వివరించారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ అంధేర్ నగరి, చౌపట్ రాజా అన్నది ప్రధాని విషయంలో నిజమైందన్నారు. ఈ ర్యాలీలో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, మాజీ ఎంపి వి.హనుమంతరావు, మాజీ ఎంపి అంజన్‌కుమార్‌యాదవ్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు శారద, ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు బి. వెంకట్ పాల్గొన్నారు.

చిత్రం..పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ గురువారం చార్మినార్ నుంచి గాంధీభవన్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలు