తెలంగాణ

17 లేదా 18న అసెంబ్లీలో ముస్లిం రిజర్వేషన్ల బిల్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: అసెంబ్లీ సమావేశాలు ఈనెల 17,18 తేదీలకు వాయిదా పడే అవకాశం ఉంది. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ సమావేశాల్లో రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ బిఎసి సమావేశం శుక్రవారం జరుగుతుంది. తొలుత నిర్ణయించిన తేదీల్లో కాకుండా అసెంబ్లీ సమావేశాల తేదీలను మార్చడం కోసం ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.
ముక్కోటి ఏకాదశిని దృష్టిలో పెట్టుకొని తొమ్మిదిన సభ నిర్వహించవద్దని రెండు రోజుల క్రితం బిజెపి శాసన సభాపక్షం నాయకుడు జి కిషన్‌రెడ్డి కోరారు. స్పీకర్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం నాటి బిఎసి సమావేశంలో ఈ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. శుక్రవారం సభను నిర్వహించిన తరువాత సంక్రాంతి వరకు వాయిదా వేసి, తిరిగి 17, 18 తేదీల్లో సభను నిర్వహిస్తే బాగుంటుందని కొందరు సభ్యులు సూచించారు. 17,18న సభ జరిగే అవకాశం ఉన్నట్టు తెలిసింది. శుక్రవారం అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకున్న తరువాత నిర్ణయం తీసుకుంటారు. 17 లేదా, 18న సభలో ముస్లిం రిజర్వేషన్ల బిల్లు పెడతారు. బిల్లు ఆమోదం తరువాత పార్లమెంటు దీనిపై నిర్ణయం తీసుకుంటుంది.