తెలంగాణ

జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్నా భోజన పథకం అమలు చేసే విషయం పరిశీలిస్తున్నట్టు ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం శాసన సభలో ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, బానోతు శంకర్ నాయక్ అడిగిన ప్రశ్నపై మంత్రి ఈ విషయం తెలిపారు. రాష్ట్రంలో 2కోట్ల 73లక్షల, 66వేల, 328 లబ్దిదారులకు సబ్సిడీ బియ్యం అందజేస్తున్నట్టు చెప్పారు. 2016-17 సంవత్సరానిక బడ్జెట్‌లో ఈ పథకానికి 2200 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలిపారు. కేంద్రం అందజేసే నిధులతో కలిపి రాష్ట్రం ఏటా ఏడువేల కోట్ల రూపాయలు ఈ పథకానికి ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలు చేసే అవకాశం ఉందా? అని ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రశ్నించగా, దీనిపై పరిశీలన జరుగుతున్నదని తెలిపారు.