తెలంగాణ

బయ్యారం ఉక్కు.. మానుకోటకు దిక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జనవరి 5: బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు అనే నినాదం నిజం కాబోతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో బయ్యారంలో ఉక్క్ఫ్యుక్టరీ నిర్మించాలనే డిమాండ్ ఉండేది. నాటి ఉద్యమ నేత కేసీఆర్ ఆ తరువాత ముఖ్యమంత్రి కావడంతో మహబూబాబాద్ (మానుకోట) జిల్లా బయ్యారంలో భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర పునర్‌విభజన చట్టంలో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలని ఉండడంతో కేంద్రప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. కొత్త జిల్లాలు ఏర్పడకముందు ఖమ్మం జిల్లాలో ఉన్న బయ్యారం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో చేరింది. ఇప్పటి వరకు వెనుకబడిన గిరిజన ప్రాంతంగా ఉన్న మహబూబాబాద్ జిల్లాలో బయ్యారం కలువడంతో ఈ ప్రాంతమంతా అభివృద్ధిలో దూసుకుపోనుంది. బయ్యారంలో ఉక్క్ఫ్యుక్టరీ నిర్మాణం కానుండడంతో వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలతోపాటు ఈ ప్రాంతమంతా కళకళలాడనుంది. ఇటీవలే మంత్రి కేటిఆర్ ఆసెంబ్లీలో బయ్యారంలో ఉక్క్ఫ్యుక్టరీ నిర్మించి తీరుతామని స్పష్టం చేయడంతో ఈ ప్రాంతవాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. బయ్యారం ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అటవీ ప్రాంతంలో ఖనిజసంపదపై ఇటీవలే టాస్క్ఫోర్స్ బృందంతో సమగ్ర సర్వే నిర్వహించారు. ప్రతిపాదిత సామర్థ్యంతో కాకుండా తక్కువ కెపాసిటితోనైనా ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పడానికి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)కూడా అధ్యయనం చేసినట్లు తెలిసింది. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి చేస్తూండటంతో కేంద్రం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. నూతనంగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి పరిశ్రమలు లేవు. దీంతో ఈ లోటును బయ్యారం ఉక్కు పరిశ్రమ తీర్చనుంది. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం, కొత్తగూడ, గంగారం అటవీ ప్రాంతంలో వేలాది టన్నుల ఇనుప ఖనిజాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతంలోని ఉక్కు నిక్షేపాలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నించారు. అక్రమంగా వాటిని తరలించేందుకు చేసిన ప్రయత్నాలను తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్‌ఎస్ అడ్డుకుంది. చివరకు ఇక్కడే ఉక్కు ఫ్యాక్టరీ రాబోతూండటం స్థానికులకు ఆశలు చిగురించేలా చేస్తోంది.