తెలంగాణ

ప్రిన్సిపాల్ మందలించాడని విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జనవరి 5: ప్రిన్సిపాల్ మందలించాడని విద్యార్థిని కళాశాల భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేటలో గు రువారం జరిగింది. సిద్దిపేట మండలం పుల్లూరు కు చెందిన ఎర్రోళ్ల వెంకట్‌గౌడ్ కుమార్తెలు భవాని(17), శివాని(16) సాయిచైతన్య జూ. కళాశాలలో ఇంటర్మీడియట్ సిఇసి చదువుతున్నారు. బుధవారం బస్‌పాస్ రెన్యువల్ కోసం భవాని స్నేహితురాలి దగ్గర నుంచి వంద రూపాయలు అప్పుగా తీసుకుంది. అదే క్లాస్‌లోని మరో విద్యార్థినికి చెందిన వంద రూపాయలు చోరీకి గురికాగా అందరి బ్యాగులు వెతికారు. భవానివద్ద వంద రూపాయలు ఉండడంతో, ఆమే చోరీ చేసిందని సహచర విద్యార్థినివిద్యార్థులు ప్రిన్స్‌పాల్‌కు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి తరగతి గదిలోనే మిగతావారి సమక్షంలో మందలించడంతో అవమానంగా భావించింది. ఇంటికివెళ్లిన అనంతరం రాత్రి భోజనం చేయలేదని, తల్లిదండ్రులు వెంకట్‌రెడ్డి, పద్మ ఎందుకు అదోలా ఉన్నావని ప్రశ్నించినా సమాధానం చెప్పలేదని ఆమె చెల్లెలు చెప్పింది. ఆ తరువాత విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అనవసరంగా అపవాదు మూటకట్టుకున్నావని, తమని అడిగితే ఇచ్చేవాళ్లంకదా అని, స్నేహితులను ఎందుకు అడిగావని అంటూ డబ్బులు ఇచ్చి పంపారు. కాగా గురువారం కళాశాలకు వచ్చిన భవాని జరిగిన విషయాన్ని మరచిపోలేక తీవ్ర మనస్తాపానికి గురై కళాశాల 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆస్పత్రికి తరలించే లోపే భవాని మృతిచెందింది. వన్‌టౌన్ ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. తమ కుమార్తె భవాని మృతి చెందిందన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సిద్దిపేట ఏరియా హాస్పిటల్‌కు చేరుకుని కన్నీరుమున్నీరై విలపించారు.