తెలంగాణ

ట్యాంక్‌బండ్‌పై యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గాంధీనగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సుమారు 40 సంవత్సరాల వయస్సు కలిగిన ఓ గుర్తు తెలియని యువకుడు తాను ధరించిన చొక్కాను చించి తాడులా మార్చుకుని ట్యాంక్‌బండ్‌పై గల అన్నమయ్య విగ్రహం వెనుక భాగంలో ఉన్న చెట్టుకు ఊరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రోజు మాదిరిగానే ఇక్కడ వాకింగ్ వచ్చేవారు గురువారం ఉదయం స్థానిక గాంధీనగర్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి సంబంధించిన వారు ఎవ్వరైన ఉంటే గాంధీనగర్ పోలీసులను సంప్రదించాలని అడ్మిన్ ఎస్‌ఐ గోపికిరణ్‌రెడ్డి తెలిపారు.

చిత్రం.. ఆత్మహత్యకు పాల్పడిన గుర్తు తెలియని యువకుడు