తెలంగాణ

బావిలో జారిపడి రైతు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, జనవరి 5: రాత్రిపూట విద్యుత్ సరఫరా రైతుల ప్రాణాలకు ప్రమాదంగా మారుతోంది. పంటలు కాపాడుకోవాలంటే నీరుపెట్టాలి. అర్ధరాత్రైనా సరే కరెంటు వచ్చినపుడే ఆ పని చేయాలి. అందుకే ఎంత రాత్రయినా చేలకు రైతులు వెళుతున్నారు. ఒక్కోసారి వారు ప్రమాదాలకు గురవుతున్నారు. అలాంటి సంఘటనే కేసముద్రంలో జరిగింది. మోటార్ వేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ రైతు దుర్మరణం పాలైన సంఘటన విషాదం నింపింది.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం దన్నసరి గ్రామానికి చెందిన రైతు నానబాల కుమారస్వామి (38) బుధవారం రాత్రి చేలకు నీరుపెట్టేందుకు వ్యవసాయభూములవద్దకు వెళ్లాడు. రాత్రి 11 గంటల నుంచి గురువారం తెళ్లవారుజాము 2 గంటల వరకు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా ఉంటుండటంతో మొక్కజొన్న చేలను తడిపేందుకు మోటార్ వేశాడు. అయినా నీళ్లు రాకపోవడంతో పైప్‌లో గాలి తీసేందుకు వ్యవసాయబావిలోకి దిగాడు. ఆ క్రమంలో పట్టుతప్పి బావిలోకి జారిపోయాడు. తలకు బలమైన గాయాలై ప్రాణాలు కోల్పోయాడు. తెళ్లవారినా కుమారస్వామి ఇంటికి తిరిగి రాకపోవడంతో సోదరుడు పంటచేల వద్దకు వెళ్లాడు. బావివద్ద అన్న చెప్పులు కనిపించడంతో అనుమానం వచ్చి బావిలోకి దిగి వెతికితే మృతదేహం కనిపించింది. కాగా పగటి పూట ఆరు గంటలు, రాత్రి పూట 3 గంటలు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. పంటలకు నీరు పెట్టేందుకు రాత్రి పూట కూడా మోటార్లు పెట్టడం అనివార్యంగా మారుతోందని, అది ప్రాణాలమీదకు వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు, మృతుని కుటుంబ సభ్యులు కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు.