తెలంగాణ

దారి మళ్లుతున్న నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6:ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లుతున్నాయని, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలకు సైతం సబ్ ప్లాన్ నిధులు మళ్లిస్తున్నారని కాంగ్రెస్ శాసన సభాపక్షం ఉప నాయకుడు మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. శుక్రవారం శాసన సభలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌పై జరిగిన చర్చలో భట్టి మాట్లాడుతూ 2013లో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సబ్ ప్లాన్ చట్టబద్ధంగా అమలు చేసి తీరాలనే ఉద్దేశంతో చట్టం చేసినట్టు చెప్పారు. ఆ తరువాత తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమాల వల్ల ఈ చట్టం అమలు కోసం చర్యలు తీసుకోలేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు అవుతోంది, సబ్ ప్లాన్ చట్టం అమలు కోసం అవసరమైన చర్యలు ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదని భట్టివిక్రమార్క ప్రశ్నించారు. 55లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని, ఇప్పటి వరకు మూడు వేల మందికి మాత్రమే మూడెకరాల భూమి ఇచ్చారని, ఇదే విధంగా కొనసాగితే అందరికీ మూడెకరాల భూమి ఇవ్వడానికి మూడు వందల సంవత్సరల కాలం పడుతుందని అన్నారు. పోడు భూముల్లో రైతులు వ్యవసాయం చేసుకుంటుంటే అటవీ శాఖ అధికారులు దాడులు జరుపుతున్నారని అన్నారు. ఇందిరాగాంధీ పేరు ఉందని సహించలేక ప్రాణహిత ప్రాజెక్టును మూలన పడేశారని అన్నారు.రెండున్నర ఏళ్లలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఖర్చు చేయాల్సిన 17,078 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదని చెప్పారు. రెండున్నర ఏళ్ల కాలంలో 26,152 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉండగా, 9074 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు.
ఎస్సీ ఎమ్మెల్యేలతో సమావేశం: సండ్ర వెంకటవీరయ్య
గతంలో ఎస్సీ ఎమ్మెల్యేలతో మంత్రి రెండు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించి సమస్యలపై చర్చించే వారని టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అలా సమావేశం నిర్వహించలేదని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్ చంద్రకు పదవీ కాలం పొడిగింపు కోసం ప్రభుత్వం ప్రయత్నించిందా? లేదా? చెప్పాలని ప్రశ్నించారు.