తెలంగాణ

దళితులపై వారికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఖైరతాబాద్, జనవరి 6: అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై చర్చజరుగుతుండగా సిఎం, సభావ్యవహారాల మంత్రి హరీష్‌రావు, కెటి ఆర్‌లు లేకపోవడం వారికి దళితులపై ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేసిందని టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. అతి ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతుంటే వారు లేకపోవడం దారుణం. ప్రతిపక్ష నాయకులు అడిగే ప్రశ్నలకు సిఎం సమాధానం ఇవ్వాలి. ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన తెలంగాణ బిడ్డలకు సరైన గౌరవాన్ని ప్రభుత్వం ఇవ్వలేదని ఆయన విమర్శించారు.
గిట్టుబాటు ధర అందించడంలో విఫలం
రైతులకు గిట్టుబాటు ధరను అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అవుతోందని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. దీనిపై పూర్తిస్థాయిలో చర్చ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం సరికాదన్నారు. రైతులు నిట్టనిలువుగా దోపిడీకి గురవుతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు నీటి పారుదల ప్రాజెక్టులకు భారీ నిధులు కేటాయిస్తున్నామని చెప్పడం సిగ్గుచేటన్నారు.
కల్వకుర్తికి నీరు వచ్చే వరకు పోరాటం చేస్తాం
కల్వకుర్తికి నీరు వచ్చే వరకు తాము పోరాటం చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి అన్నారు. కల్వకుర్తి నియోజక వర్గంలో నిర్మించిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ వల్ల ఒక్క చుక్క నీరు కూడా రావడం లేదని, ఆ ప్రాజెక్టు ద్వారా మాకు నీరు ఇవ్వకుండా క్రింది ప్రాంతాల వారికి నీటిని తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. అభివృద్ధికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం అభివృద్ధి చేస్తామంటే ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్నాయని విమర్శించారు.