తెలంగాణ

దియోని గోవుకు దిక్కేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జనవరి 6: గోవుల్లో అత్యంత అరుదైన దియోని జాతి ఆవుల మనుగడకు పెద్దప్రమాదం ముంచుకొచ్చింది. జహీరాబాద్ మండలంలో ఆ జాతి ఆవుల సంరక్షణ కేంద్రానికి నిధులు నిలిపివేయడంతో అక్కడున్న 46 దియోని జాతి ఆవుల పరిస్థితి అగమ్యగోచరమైంది. రోడ్డుపై మేతకోసం వెంపర్లాడుతున్న ఆ గోవులు కబేళాకు తరలించేస్తారేమోనన్న అందోళన స్థానికుల్లోల వ్యక్తమవుతోంది. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జహీరాబాద్ మండలంలోని గొటిగార్‌పల్లిలో దియోని పశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకు అవసరమైన 32 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. మహారాష్టల్రోని లాతూర్, కర్నాటకలోని బీదర్, తెలంగాణాలోని జహీరాబాద్ ప్రాంతంలో దియోని పశు సంపద అధికంగా కనిపిస్తుంది. ఈ దియోని పశుసంపదను పెంచిపోషించడానికి అప్పటి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుని పశు పోషణ కేంద్రాన్ని నిర్మింపజేసింది. దియోని పశువులతో పాటుగా ఇతర రకాల పశువులకు కూడా ఇక్కడ పునరావాసం కల్పించారు. 2004 సంవత్సరం నుంచి ఈ కేంద్రం నిరాదరణకు గురవుతూ వస్తోంది. గత యేడాది నుంచి ఏ మాత్రం బడ్జెట్ కూడా కేటాయింపు జరగలేదు.
ఉన్న పశువులను సైతం వేలం వేసి విక్రయించాలన్న ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఉన్న పశువులను తాము తీసుకువెళ్లి గోశాలల్లో పోషించుకుంటామని జహీరాబాద్, బీరంగూడ, పటన్‌చెరుకు చెందిన గోశాలల యజమానులు సంప్రదించినా వారికి అప్పగించకపోవడం శోచనీయం. వేలం వేస్తే ఏ కబేళా యజమానో వచ్చి కొనుగోలు చేస్తే 46 మూగ జీవాలు మృత్యువాత పడటం ఖాయమని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ కేంద్రంలో వెటర్నరి డాక్టర్‌తో పాటు ఆరుగురు కూలీలు పని చేస్తున్నారు. పశువుల కోసం దాణా కేంద్రం, పశుగ్రాసం పెంచడానికి విలువైన భూమి ఉన్నా ప్రభుత్వం ఆదరించకపోవడంతో అరుదుగా కనిపించే దియోని గోవులు పూర్తిగా కనుమరుగు కావడం తథ్యం. పశు సంపదను పరిరక్షించడానికి అనేక గోశాలలు వెలుస్తుండగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోసంరక్ష కేంద్రం పూర్తిగా నిరాదరణకు గురవుతుండటంతో గో పరిరక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దియోని గో పరిరక్షణ కేంద్రాన్ని ప్రభుత్వం పటిష్టపర్చడమో లేక ఉన్న గోవుల ప్రాణాలు పోకముందే ఏదైనా గోశాలకు అప్పగించడమో చేసి మూగ జీవాలను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

చిత్రం.. అడవిలో మేత మేస్తున్న దియోని గోవులు