తెలంగాణ

ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జనవరి 6: తెలంగాణలో కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను అమలు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. బిజెపి రెండు రోజుల జాతీయ కార్యవర్గం సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వచ్చిన లక్ష్మణ్ శుక్రవారం విలేఖరులతో మాట్లాడారు. టిఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై తయారు చేసిన ఒక నివేదికను జాతీయ కార్యవర్గానికి అందజేశామని ఆయన చెప్పారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజల వద్దకు తీసుకుకెళ్ళేందుకు అనుసరించవలసిన వ్యూహాన్ని ఈ నెలాఖరున ఖమ్మం జిల్లాలో జరిగే బిజెపి రాష్ట్ర శాఖ కార్యవర్గం సమావేశంలో ఖరారు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి లక్షా తొంబై వేల ఇళ్లను మంజూరు చేసి ఒక్కొక్క దానికి లక్షన్నర రూపాయలు ఇస్తే వీటిని నిర్మించి బడుగు,బలహీన వర్గాలకు ఇవ్వటంలో కెసిఆర్ ప్రభుత్వం విఫలమైందని లక్ష్మణ్ దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అడ్డుకునేందుకు బిజెపి రాష్ట్ర శాఖ గత మూడు నెలల్లో నిర్వహించిన పోరాటాలపై పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు ఒక నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. రైతుల సమస్యల పరిష్కారం , రుణ మాఫీ, ప్రధాన మంత్రి పంటల బీమా పథకాలను అమలు చేయటంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని ఆయన దుయ్యబట్టారు. విద్యార్థుల ఫీజు బకాయిల చెల్లింపుల్లో కూడా జాప్యం జరుగుతోందని, దీని వలన పద్నాలుగు లక్షల మంది జీవితం ప్రశ్నార్థకంగా మారుతోందని చెప్పారు.
బిజెపిని గ్రామస్థాయిలో పటిష్ఠం చేస్తామన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరుగుతోందని లక్ష్మణ్ తెలిపారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదన్నారు.ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను శాసన సభ లోపల, బైట గట్టిగా వ్యతిరేకిస్తామన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తామన్నారు. ఖమ్మంలో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తదుపరి మూడు నెలలకు పార్టీ వ్యూహాన్ని, కార్యక్రమాన్ని తయారు చేసుకుని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు. అన్ని జిల్లాల్లో పార్టీ శిక్షణా తరగతులు పూర్తి చేస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన అన్ని పథకాలను గ్రామ స్థాయిదాకా తీసుళ్తామని లక్ష్మణ్ చెప్పారు. అమిత్ షా త్వరలోనే తెలంగాణాలో పర్యటించే అవకాశాలున్నాయని లక్ష్మణ్ తెలిపారు.