తెలంగాణ

కేంద్ర బడ్జెట్‌లో బీబీనగర్ ఎయిమ్స్ చేర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: హైదరాబాద్‌కు సమీపంలోని బీబీనగర్‌లో ఏర్పాటు చేయాల్సిన అఖిల భారత వైద్య విజ్ఞాన కేంద్రం(ఎయిమ్స్) ప్రతిపాదనను కేంద్ర బడ్జెట్‌లో చేర్చాలని టిఆర్‌ఎస్ ఎంపీలు వినోద్‌కుమార్, కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈమేరకు ఇద్దరు ఎంపీలు శుక్రవారం కేంద్ర కేంద్ర వైద్య శాఖ మంత్రి జెపి నడ్డాను కలిసి వినతి పత్రం అందజేశారు. తాము ఇటీవల ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిసి బీబీనగర్ ఎయిమ్స్‌కు నిధులు కేటాయించాలని కోరగా వైద్య శాఖ నుంచి ప్రతిపాదన వస్తే బడ్జెట్‌లో చేర్చి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని వారు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఎంపీలు మంత్రి నడ్డా దృష్టికి తీసుకొచ్చారు. బీబీనగర్ ఎయిమ్స్‌కు సంబంధించిన ప్రతిపాదలను ఆర్థిక శాఖకు పంపించాలని వారు విజ్ఞప్తి చేశారు. బీబీనగర్ ఎయిమ్స్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు చాలాకాలం నుంచి పెండింగ్‌లో ఉన్నాయని వారు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణకు కూడా ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతోందని వినోద్, ప్రభాకర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీలు చెప్పినదంతా సావధానంగా విన్న మంత్రి నడ్డా 2017-18 బడ్జెట్‌లో బీబీనగర్ ఎయిమ్స్‌ను చేర్చేందుకు అవసరమైన ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంపిస్తామని హామీ ఇచ్చారు.