తెలంగాణ

17, 18 తేదీల్లో మళ్లీ అసెంబ్లీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: తెలంగాణ శాసనసభ ఈ నెల 17, 18 తేదీల్లో కూడా సమావేశం కాబోతోందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు శాసనసభలో చెప్పారు. తెలంగాణ ఆరో శాసనసభ సమావేశాలు పదహారో రోజు శుక్రవారం వాయిదా పడ్డాయి. తిరిగి సమావేశాలు సంక్రాంతి అనంతరం 17వ తేదీన ప్రారంభం అవుతాయి. రెండు రోజుల పాటు కొనసాగిన తర్వాత నిరవధికంగా వాయిదా పడుతాయని తెలిసింది. 17, 18 తేదీల్లో మైనార్టీల రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టే వీలుందని శాసనసభ సచివాలయ అధికారులు పేర్కొన్నారు. తొలుత సమావేశాలను డిసెంబర్ 31 వరకూ నిర్వహించాలని భావించినా తర్వాత 11వ తేదీ వరకూ పొడిగించాలని నిర్ణయించారు. అయితే 7,8 తేదీల్లో శని, ఆది వారాలు రావడం, 8న ముక్కోటి ఏకాదశి కావడం, ఉపవాసాలు కొనసాగుతాయి కనుక 9వ తేదీన సభ నిర్వహించరాదని కొంత మంది ఎమ్మెల్యేలు సూచించడంతో పాటు 10వ తేదీ నుండి సంక్రాంతి సెలవులు ఉండటంతో ఏకంగా 17వ తేదీకి సభను వాయిదా వేశారు.