తెలంగాణ

ఎస్సీ ఎస్టీలపై చిన్నచూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: సర్కారు ఎస్సీ, ఎస్టీలను చిన్నచూపు చూస్తూ అవమాన పరుస్తోందని శాసన మండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి ప్రారంభమైన మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణానికి చెందిన రాజీవ్ శర్మకు మూడుసార్లు పదవీ కాలాన్ని పొడిగించిన ప్రభుత్వం దళిత సామాజికవర్గానికి చెందిన ప్రదీప్‌చంద్రకు ఎందుకు పొడిగించలేదని ప్రశ్నించారు. అంతేగాక, రాజీవ్ శర్మ పదవీ విరమణ సభను ఎంతో ఘనంగా నిర్వహించిన ప్రభుత్వం అదే సభలో రాజీవ్‌శర్మను ప్రత్యేక ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రకటన చేసిందని, అదే ప్రదీప్‌చంద్ర వీడ్కోలు సభను ఎంతో సింపుల్‌గా నిర్వహించి చీఫ్ సెక్రటరీ హోదాలో కొనసాగిన ఓ దళిత వ్యక్తిపట్ల చిన్నచూపుతో వ్యవహరించిందని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని షబ్బీర్ అలీ , రాజీవ్‌శర్మకు ఎలా పొడిగించారు..ప్రదీప్‌చంద్రకు ఎందుకు పొడిగించలేదని ప్రశ్నించారు. కేవలం విద్యా, ఉపాధి రంగాల్లోనే గాక, రాజకీయాల్లో కూడా రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 85 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాల నుంచి కేవలం ఒక్కొక్కరికి మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించారని, మిగిలిన వర్గాలకు చెందిన 11 మంది మంత్రులను నియమించుకుని, కేవలం అగ్రవర్ణాలకు చెందిన వారితోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని వ్యాఖ్యానించటంతో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, సభ్యులు పాతూరి సుధాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి జోక్యం చేసుకుని షబ్బీర్ అలీ సబ్జెక్టును డీవియేట్ చేసి రాజకీయాలు మాట్లాడుతున్నారని, ఓ సీనియర్ నేత ఈ రకంగా మాట్లాడటం దురదృష్టకరం అని అన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ రిటైర్డు చీఫ్ సెక్రటరీ గురించి మాట్లాడటం డీవియేషనా? అని షబ్బీర్ వ్యాఖ్యానించారు.
కేంద్రం సానుకూలంగా లేదు: ఈటల
రాజీవ్ శర్మ మాదిరిగానే ప్రదీప్‌చంద్ర పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ కేంద్రానికి లేఖ పంపామని, కాని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా లేకపోవటం వల్లే పెంచలేదని ఆర్థిక మంత్రి ఈటల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ వివరణలో భాగంగా సభ్యులకు సమాధానం చెప్పారు.