తెలంగాణ

బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.100కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో అన్ని కులాల వారి అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగానే బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం శాసనమండలిలో సభ్యుడు పురాణం సతీష్‌కుమార్ బ్రాహ్మణ వర్గ సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపు, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రశ్నించారు. అందుకు మంత్రి సమాధానమిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ వివిధ కులమతాలకు చెందిన వారి అభివృద్ధికోసం అనేక పనులు చేపట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగానే బ్రాహ్మణుల సంక్షేమ నిధికోసం 2016-17 బడ్జెట్‌లో రూ.100 కోట్ల మొత్తాన్ని కేటాయించామని మంత్రి వెల్లడించారు. బ్రాహ్మణుల స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం పండితులు, అర్చకులు, ప్రతినిధులు తదితరులతో ముఖ్యమంత్రి చర్చించారని తెలిపారు. బ్రాహ్మణుల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై తొమ్మిది మంది సభ్యులతోకమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇందులో భాగంగా బ్రాహ్మణ సదనాన్ని నిర్మించడం కోసం ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి మండలంలోని గోపన్నపల్లి పరిధిలో ఆరెకరాల 10 గుంటల స్థలాన్ని కేటాయించామని మంత్రి తెలిపారు. సభ్యుడు సతీష్‌కుమార్ మాట్లాడుతూ బ్రాహ్మణ పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లేందుకు ప్రభుత్వం రూ.20 లక్షలు ఆర్థిక సాయం చేయాలని కోరారు. బ్రాహ్మణ సదనాన్ని ఆరెకరాలకు బదులు పది భూమిని కేటాయించి అందులోబ్రాహ్మణులకు నివాస సముదాయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
160 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు
రాష్ట్రంలో 160 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రస్తుతం 71 పాఠశాలలో 12వేల 554 మంది విద్యార్థులు చేరారని, ఈ పాఠశాలల అభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ.350 కోట్లు కేటాయించామని ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో శాశ్వత సిబ్బందిని తెంలగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ద్వారా త్వరలో నియమిస్తామని పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి మహమూద్ అలీ సమాధానమిచ్చారు.