తెలంగాణ

అటవీ భూముల్లో సాగు కుదరదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: రాష్ట్రంలో అడవులు రికార్డుల ప్రకారం 25శాతం విస్తీర్ణంలో ఉన్నా, వాస్తవానికి పది పదకొండు శాతానికి మించి లేవని పేర్కొంటూ, దీనిపై ఏం చేయాలో అంతా కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం శాసన సభలో అన్నారు. శాసన సభలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌పై చర్చ సందర్భంగా టిడిపి సభ్యులు సండ్ర వెంకట వీరయ్య అడవుల్లో చెట్లు కొట్టేస్తే కొందరికి వ్యవసాయం చేసుకోవడానికి పట్టాలు ఇచ్చారు కాబట్టి తమకూ ఇస్తారని చాలా మంది ఆశలు పెట్టుకొని చెట్లు కొట్టేస్తున్నారని తెలిపారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి వివరణ ఇస్తూ అటవీ భూములను బదలాయించడానికి అవకాశం లేదని చెప్పారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు కేవలం అటవీ సంబంధ ఉత్పత్తులు పెంచి, వాటిని అనుభవించడానికి మాత్రమే అధికారం కల్పిస్తుందని, అంతే తప్ప అడవుల్లో చెట్లను నరికేసి వ్యవసాయం చేసేందుకు కాదని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు, అటవీ చట్టాలు ఇదే చెబుతున్నాయని, చివరకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాపైన కూడా ఈ విషయం చాలా స్పష్టంగా ఉంటుందని కెసిఆర్ తెలిపారు. కొంత మంది ప్రజలను రెచ్చగొట్టి అడవుల్లో చెట్లను నరికేయిస్తున్నారని, ఇలాంటివి నిరోధించాలని అన్నారు.
అడవుల్లోని భూమి అవసరం కోసం తీసుకుంటే అంతే మొత్తం భూమిని అటవీ భూమిగా అటవీ శాఖకు అప్పగించాలని, ఎకరానికి ఆరు లక్షల చొప్పున నిధులు చెల్లించాలని చెప్పారు. నల్లగొండ జిల్లాలో థర్మల్ పవర్ స్టేషన్ కోసం ఇదే విధంగా అటవీ శాఖకు డబ్బులు చెల్లించినట్టు చెప్పారు. తీరా వెళ్లి చూస్తే అక్కడ అడవి లేదని, సాగు చేసుకుంటున్నారని చెప్పారు. ఇతర ప్రాంతాల్లో భూ సేకరణ జరిపితే డబ్బులు ఇచ్చినట్టుగా వీరికి డబ్బులు ఇచ్చినట్టు చెప్పారు. దీని వల్ల భూసేకరణకు వ్యయం రెట్టింపు అయిందని చెప్పారు. చాలా చోట్ల ఇదే విధంగా రికార్డుల్లో అటవీ భూమి అని ఉంటుందని, కానీ వాస్తవంగా దీనిలో చాలా భూమిని కొందరు సాగు చేసుకుంటున్నారని చెప్పారు. ఈ అంశంపై ఏం చేద్దాం అనేది అందరం కలిసి ఆలోచించాలని అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఈ సమస్యపై నిర్ణయం తీసుకుందామని సిఎం సూచించారు.